రాత్రి పడుకొనే ముందు 1 గ్లాసు తాగితే 60 లో కూడా 20 ఏళ్ల వ్యక్తిలా హుషారుగా ఉంటారు
sesame seeds And almonds : శరీరంలో బలహీనత, calcium లోపం కారణంగా ఏ పని చేయాలన్నా ఆసక్తి ఉండదు. ఒక వేళ చేయటానికి ప్రయత్నం చేసిన చేయలేక తీవ్రమైన అలసట,నీరసం ఉంటాయి. ఇప్పుడు చెప్పే చిట్కా పాటిస్తే తక్షణ శక్తి లభిస్తుంది. ఈ వేసవికాలంలో కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది.
దీనికోసం ముందుగా పాన్ లో రెండు స్పూన్ల నువ్వులు, 5 బాదంపప్పులు, రెండు స్పూన్ల గసగసాలను వేసి డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీలో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని ఎక్కువ మోతాదులో తయారుచేసుకొని నిల్వ చేసుకోవచ్చు. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ పాలను పోసి దానిలో ఒక స్పూన్ పొడిని వేసి మూడు పొంగులు వచ్చాక చిన్న బెల్లం ముక్క వేసి ఒక నిమిషం అయ్యాక గ్లాసులో పోయాలి.
డయాబెటిస్ ఉన్నవారు బెల్లం లేకుండా తాగాలి. ఈ పాలను రాత్రి పడుకోవటానికి అరగంట ముందు తాగాలి. ఈ విధంగా తాగటం వలన నిద్రలేమి సమస్య నుండి బయట పడతారు. calcium లోపం కారణంగా వచ్చే అన్నీ రకాల సమస్యలు తొలగి పోతాయి. నువ్వుల్లో ఉన్న ఫైబర్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది.
బాదంలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. గసగసాలు జీర్ణ సంబంద సమస్యలు లేకుండా చేస్తుంది. తలనొప్పి,దగ్గు,ఉబ్బసం వంటి వాటిని తగ్గిస్తుంది. ఈ పొడిని తీసుకోవటం 60 లో కూడా మంచి శక్తితో అలసట లేకుండా ఉంటారు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/