3 సార్లు తీసుకుంటే 100 ఏళ్ళు వచ్చినా కాల్షియం లోపం ఉండదు…నొప్పులు,నిద్రలేమి,అలసట ఉండవు
calcium deficiency Home Remedies : మనలో చాలా మంది నొప్పులు రాగానే పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. అలా కాకుండా మన ఇంటిలో ఉండే పదార్ధాలను తీసుకొని చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు చెప్పే రెమెడీ ఫాలో అయితే కాల్షియం లోపం అనేది ఉండదు. అలాగే నొప్పులు,నిద్రలేని,అలసట వంటి సమస్యలు ఉండవు.
ఒక గిన్నెలో ఒక స్పూన్ నెయ్యి వేసి దానిలో ఒక స్పూన్ గసగసాలు, ఒక స్పూన్ ఎండు కొబ్బరి వేసి కొంచెం వేగించాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ పాలను పోసి ఒక స్పూన్ సొంపు వేసి మరిగించాలి. ఆ తర్వాత చిన్న పటికబెల్లం ముక్కను వేసి ఒక నిమిషం మరిగించి గ్లాస్ లో వడకట్టి తాగాలి. డయాబెటిస్ ఉన్నవారు పటికబెల్లం లేకుండా తాగాలి.
ఈ పాలను ఉదయం లేదా రాత్రి పడుకోవటానికి పావుగంట ముందు తాగితే సరిపోతుంది. ఈ పాలను తాగటం వలన కాల్షియం లోపం తొలగిపోయి కాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులు, నిద్రలేమి,అలసట వంటి అన్నీ రకాల సమస్యలు తొలగిపోతాయి. గసగసాలు మన శరీరంలో ఎన్నో వ్యాధులను తగ్గిస్తాయి. సొంపు కొవ్వును తగ్గిస్తుంది. కంటి చూపు మెరుగుదలకు సహాయపడుతుంది.
కొబ్బరిలో కాల్షియం సమృద్దిగా ఉంటుంది. అలసట నీరసం తగ్గి తక్షణ శక్తిని అందిస్తుంది. పటికబెల్లం శరీరంలో వేడిని తగ్గిస్తుంది. ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారు. ఈ పాలను అన్నీ వయస్సుల వారు తాగవచ్చు. వారంలో మూడు సార్లు తాగితే సరిపోతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.