ఈ గింజలు 100 % రక్తాన్ని శుద్ది చేయటమే కాకుండా హార్ట్ స్ట్రోక్,బ్రెయిన్ స్ట్రోక్,పెరాలసిస్ రాకుండా కాపాడతాయి
Hemp seeds benefits in telugu : ఈ మధ్య కాలంలో మారిన పరిస్థితుల కారణంగా మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవటానికి ఆసక్తి చూపుతున్నారు. వాటిలో ఒకటైన జనపనార విత్తనాల గురించి తెలుసుకుందాం. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండెపోటు మరియు స్ట్రోక్స్ వంటివి రాకుండా కాపాడుతుంది.
అమైనో ఆమ్లాలు, అర్జినైన్ మరియు గామా-లినోలెయిక్ యాసిడ్ ఉండుట వలన వాపును తగ్గించడంలో సహాయపడుతుంది, రక్తపోటును తగ్గిస్తుంది మరియు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే నాడీ సంబంద సమస్యలను తగ్గిస్తుంది. వయస్సు పెరిగే కొద్ది వచ్చే పార్కిన్సన్స్ వ్యాధి,అల్జీమర్స్ వ్యాధి,నరాలకు సంబందించిన వ్యాధులు మరియు బ్రెయిన్ స్ట్రోక్, పెరాలసిస్ వంటి సమస్యలను తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది.
జనపనార విత్తనాలలో ఐరన్ సమృద్దిగా ఉండుట వలన ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచటానికి సహాయపడి రక్తహీనత సమస్య లేకుండా చేయటమే కాకుండా రక్తాన్ని వంద శాతం శుద్ది చేస్తుంది. జనపనార విత్తనాలలో 21 ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉండుట వలన శరీరంలో కొత్త కణజాలాలను సృష్టించడం, కండర ద్రవ్యరాశిని పెంచడం మరియు ఎముక సాంద్రతను బలోపేతం చేయడంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది.
అధిక బరువు సమస్యతో బాధపడేవారికి జనపనార విత్తనాలు మంచి ఎంపిక అని చెప్పవచ్చు. అలాగే నిద్రలేమి సమస్యను తగ్గిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచటంలో సహాయపడి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన జీర్ణ సంబంద సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.