1 గ్లాస్ తాగితే కొవ్వు కరిగి,బరువు తగ్గి, ఎంత పెద్ద పొట్ట ఉన్నా సరే తగ్గి స్లిమ్ గా మారతారు
Fat Burning Drink : ఈ రోజుల్లో బరువు అయితే స్పీడ్ గా పెరగటం జరుగుతుంది, కానీ తగ్గాలంటే మాత్రం చాలా పెద్ద సమస్యగా మారుతుంది. ప్రతి రోజు అరగంట వ్యాయామం లేదా యోగా చేస్తూ ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగితే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. ఉదయం ఒకసారి,సాయంత్రం ఒకసారి 15 రోజులు తాగితే మంచి ప్రయోజనం కనపడుతుంది.
పొయ్యి మీద గిన్నె పెట్టి రెండు గ్లాసుల నీటిని పోసి ఒక స్పూన్ అల్లం పేస్ట్, రెండు అంగుళాల దాల్చిన చెక్క ముక్క, అరస్పూన్ మిరియాలు కచ్చా పచ్చాగా దంచి వేయాలి. ఆ తర్వాత నిమ్మకాయలో సగాన్ని నాలుగు ముక్కలుగా కట్ చేసి వేసి 10 నిమిషాల పాటు మరిగించాలి. ఇలా మరిగించటం వలన వాటిలో ఉన్నా పోషకాలు అన్నీ నీటిలోకి చేరతాయి.
ఈ నీటిని వడకట్టి ఉదయం ఒకసారి,సాయంత్రం ఒకసారి గోరువెచ్చగా తాగాలి. ఈ డ్రింక్ శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించి బరువు తగ్గటంలో సహాయపడుతుంది. అల్లంలో జింజెరోల్స్ అనే రసాయనాలు ఉంటాయి. కొవ్వు శోషణను నిరోధించడంలో సహాయపడుతుంది. ఇది ప్రేగుల నుండి రక్తంలోకి కొవ్వుల శోషణను నియంత్రిస్తుంది.
దాల్చినచెక్కలో ఉండే సిన్నమాల్డిహైడ్ అనే రసాయనం శరీరంలో ఎంజైమ్‌ల కార్యకలాపాలను మెరుగుపరుస్తుంది, జీవక్రియను పెంచుతుంది మరియు
కొవ్వును కరిగించటంలో సహాయపడుతుంది. మిరియాలలో పైపెరిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది జీవక్రియ కార్యకలాపాల పనితీరును వేగవంతం చేస్తుంది. నిమ్మకాయ ప్రేగులలో మంచి బ్యాక్టీరియాను పెంచి శరీరంలో కొవ్వు శోషణను నియంత్రిస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.