2 స్పూన్స్ వేసవిలో వచ్చే నీరసం,అలసట,నిస్సత్తువ తగ్గటమే కాకుండా శరీరంలో వేడిని తగ్గిస్తుంది
Green Gram Benefits In telugu : పెసలు మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. పెసలను నీటిలో నానబెట్టి తినవచ్చు. లేదా మొలకలుగా తినవచ్చు. వీటిని రోజుకి రెండు స్పూన్స్ తీసుకుంటే వేసవిలో వచ్చే నీరసం,అలసట,నిస్సత్తువ తగ్గటమే కాకుండా శరీరంలో వేడిని తగ్గిస్తుంది.
అలాగే మెగ్నీషియం సమృద్దిగా ఉండుట వలన రక్తపోటు నియంత్రణలో ఉండటమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి రక్తప్రసరణ బాగా సాగి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ప్రోటీన్ మరియు ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు. దాంతో తినాలనే కోరిక తగ్గుతుంది. బరువు తగ్గాలనే ప్రణాళికలో ఉన్నవారికి మంచి ఆహార ఎంపిక అని చెప్పవచ్చు.
పెసలలో అనేక రకాల ఫైటోన్యూట్రియెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉండుట వలన హానికరమైన బ్యాక్టీరియా & వైరస్లతో పోరాడటానికి, ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియాను నిర్వహించడానికి మరియు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. శరీరానికి అవసరమైన ప్రోటీన్ అందుతుంది.
ఒత్తిడి,ఆందోళన,తలనొప్పి వంటి వాటిని తగ్గిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. కాబట్టి ఈ వేసవిలో సాధ్యమైనంత వరకు పెసలను తినటం అలవాటు చేసుకోండీ. గ్యాస్ సమస్య ఉన్నవారు పచ్చిగా తినకూడదు. గ్యాస్ సమస్య ఉన్నవారు ఉడికించి తీసుకోవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.