మజ్జిగలో ఇది కలిపి తాగితే ఎంతటి వేలాడే పొట్ట అయినా మంచులా కరిగిపోతుంది
Butter Milk Weight Loss Tips : బరువు తగ్గాలనే ప్రయత్నంలో ఉన్నవారికి ఇప్పుడు చెప్పే మజ్జిగ చాలా బాగా సహాయపడుతుంది. దీని కోసం ముందుగా పొయ్యి మీద పాన్ పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి అరస్పూన్ జీలకర్ర, రెండు స్పూన్ల కొత్తిమీర, రెండు స్పూన్ల పుదీనా, రెండు రెబ్బల కరివేపాకు వేసి 5 నిమిషాలు మరిగించి చల్లారబెట్టాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టాలి.
మరొక గిన్నెలో రెండు స్పూన్ల పెరుగును తీసుకొని దానిలో ఒక గ్లాసు నీటిని పోసి బాగా కలపాలి. దానిలో ఒక స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు, రెండు స్పూన్ల ఉల్లిపాయ ముక్కలు, చిన్న అల్లం ముక్కను దంచి వేయాలి. బాగా కలిసేలా కలపాలి. ఆ తర్వాత ఒక నిమ్మకాయ రసాన్ని పిండి బాగా కలపాలి.
ఈ మజ్జిగలో పైన తయారుచేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. అరగంట అలా వదిలేసి ఈ మజ్జిగను ఒక బౌల్ లోకి వడకట్టాలి. ఈ మజ్జిగను ఉప్పు లేకుండా తాగాలి. ఒకవేళ ఉప్పు కావాలంటే రాళ్ళ ఉప్పు వేసుకోవచ్చు. ఈ మజ్జిగను రోజులో రెండు సార్లు అంటే ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తాగాలి.
ఈ విధంగా 15 రోజుల పాటు తాగితే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగిపోతుంది. అలాగే అధిక బరువు సమస్య నుండి బయట పడతారు. అంతే కాకుండా వేసవిలో వచ్చే సమస్యలు ఏమి ఉండవు. డీహైడ్రేషన్, అలసట,నీరసం వంటివి కూడా ఉండవు. కాబట్టి ఈ వేసవిలో ఈ మజ్జిగని చేసుకొని ఆరోగ్యంగా ఉండండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.