1 కప్పు జ్ఞాపకశక్తిని పెంచి మెదడు చురుగ్గా ఉండేలా చేసి మతిమరుపు సమస్యలు లేకుండా చేస్తుంది
Green Tea Brain Health Benefits : ఈ మధ్య కాలంలో మనలో చాలా మంది మారిన ఆరోగ్య పరిస్థితుల కారణంగా మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు చెప్పే టీ మెదడు ఆరోగ్యంగా ఉండేలా చేసి వయస్సు పెరిగే కొద్ది వచ్చే అన్నీ రకాల సమస్యలు ముఖ్యంగా జ్ఞాపకశక్తి సమస్యలు లేకుండా చేస్తుంది.
ప్రతి రోజు ఒక కప్పు గ్రీన్ టీ తాగాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి బాగా మరిగాక పావు స్పూన్ గ్రీన్ టీ పొడి వేసి బాగా కలిపి పొయ్యి ఆఫ్ చేసి గిన్నె మీద మూత పెట్టాలి. పది నిమిషాలు అయ్యాక ఆ నీటిని వడకట్టి ఒక స్పూన్ నిమ్మరసం,ఒక స్పూన్ తేనె కలిపి తాగాలి. డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తాగాలి.
రోజుకి రెండు కప్పులకు మించి తాగకూడదు. గ్రీన్ టీలో కాఫీ కంటే తక్కువ కెఫిన్ ఉంటుంది, అలాగే అమైనో యాసిడ్ ఎల్-థియానైన్ కూడా ఉంది, ఇది మెదడు పనితీరును మెరుగు పరచడానికి కెఫిన్‌తో కలిసి పని చేస్తుంది. మానసిక స్థితి, అప్రమత్తత, ప్రతిచర్య సమయంలోనూ మరియు జ్ఞాపకశక్తితో సహా మెదడు పనితీరు యొక్క వివిధ అంశాలను కెఫీన్ మెరుగుపరుస్తుందని ఇటీవల జరిగిన పరిశోదనల్లో తెలిసింది.
గ్రీన్ టీలోని పాలీఫెనాల్ మన మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది. దీంతో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అంతేకాదు.. ఇవి మెదడులో ఎసిటైల్కోలిన్ ప్రక్రియను నెమ్మదిస్తాయి మరియు మెదడులోని కణాల నష్టాన్ని కూడా నివారిస్తాయి. మెదడులోని నిరోధక న్యూరోట్రాన్స్మిటర్ అయిన అడెనోసిన్ చర్యలను కెఫిన్ అడ్డుకుంటుంది. ఫలితంగా, ఇది మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే అల్జైమర్స్, పార్కిన్సన్స్ డిసీజ్ వచ్చే రిస్క్ ని కూడా తగ్గిస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.