బీరకాయతో ఇలా చేస్తే జుట్టు నుండి ఒక్క వెంట్రుక రాలదు..రాలిన జుట్టు దగ్గర 2 రెట్లు జుట్టు వస్తుంది
beerakaya Hair Fall Tips : ఈ మధ్య కాలంలో జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య ప్రారంభం కాగానే జాగ్రత్త పడితే చాలా మంచి ఫలితాలను పొందవచ్చు. జుట్టు సమస్యల పరిష్కారానికి ఇంటి చిట్కాలు బాగా సహాయపడతాయి. మన ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే వస్తువులతో ఈజీగా తగ్గించుకోవచ్చు.
బీరకాయలో సగాన్ని తొక్క తీసి ముక్కలుగా కట్ చేయాలి. ఒక మిక్సీ జార్ లో బీరకాయ ముక్కలు,రెండు కరివేపాకు రెమ్మల ఆకులు,మూడు వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసి వేయాలి. సరిపడా నీటిని పోసి జ్యూస్ తయారుచేసుకోవాలి. తయారైన జ్యూస్ ని గ్లాస్ లో పోసి దానిలో పావు స్పూన్ శొంఠి పొడి,చిటికెడు మిరియాల పొడి,పావు స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. రుచికి సరిపడా సైండవ లవణం వేసుకోవాలి.
ఈ జ్యూస్ ని ఉదయం పరగడుపున 10 రోజుల పాటు తాగితే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. జుట్టు రాలే సమస్యకు పోషకాహార లోపం కూడా ఒక కారణం కావచ్చు. అందువల్ల మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి.
బీరకాయ తెల్లజుట్టును నల్లగా కూడా మార్చుతుంది. జుట్టుకి సంబందించిన అన్నీ రకాల సమస్యలను తగ్గించటంలో బీరకాయ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. తెల్లజుట్టు సమస్యకు నూనెలో బీరకాయ ముక్కలను వేసి మరిగించి ఆ నూనెను వడకట్టి ప్రతి రోజు జుట్టుకి రాస్తూ ఉంటే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.