పరగడుపున 1 ఆకు తింటే కీళ్లనొప్పులు,మోకాళ్ళ నొప్పులు జీవితంలో ఉండవు
joint pain remedies in Telugu :భారతీయ సంస్కృతిలో బోజనం తరువాత తాంబూలం, తమలపాకు తీసుకోవడం, కిళ్ళి తినడం లాంటి ఆచారం ఆనాదిగా ఉండేది. కుల మతాలతో సంబంధం లేకుండా అన్ని మతాల వారు బోజనం తరువాత కిళ్ళి తినడం సాధారణ విషయం. దేవుడి పూజలో కూడా తమలపాకు వడడం చూస్తాం.
హిందూ సంస్కృతిలో తాంబూలానికి ఎంతో ప్రాధాన్యత వుంది. ఆధ్యాత్మిక విషయాలను పక్కన పెడితే తమలపాకు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఎ విటమిన్, సి విటమిన్, కాల్షియం, పోలిక్ యాసిడ్ తమలపాకులో పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా తాంబూలంలో రోగనిరోధక శక్తిని పెంచే అద్భుత శక్తి ఉంది. తమలపాకులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది.
తమలపాకుతో సున్నం కలిపి వేసుకుంటే శరీరంలో కాల్షియం సమపాళ్ళలో ఉండేలా చూస్తుంది. ఎప్పటికీ ఎముకలు అరిగిపోకుండా చూస్తుంది.
ఎముకలు ధృడంగా బలంగా ఉంచటంలో తమలపాకు సున్నం అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తాయి. కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు ప్రతి రోజు ఉదయం పరగడుపున ఒక చిన్న లేత తమలపాకు తింటే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.
జీర్ణవ్యవస్థకు తమలపాకు చాలా మేలు చేస్తుంది. అనేక రకాలైన విషాలను హరించగల ఔౌషధ గుణాలు తమలపాకులో ఉన్నాయి. చిన్న పిల్లలకు జలుబు చేసినప్పుడు తమలపాకు రసం ఒకటి రెండు చుక్కలు పాలతో రంగరించి ఇస్తే జలుబు, దగ్గు దూరమవుతాయి. బాలెంతలు తాంబూలం వేసుకుంటే ఎంతో మంచిది. వక్క, తమలపాకు మరియు సున్నం రెండింటినీ అనుసంధానం చేసి శరీరంలో వేడి పెరగకుండా సమతుల్యం చేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.