అర స్పూన్ పొడి శరీరంలో కొవ్వు,అధిక బరువు,జీర్ణ సమస్యలు,డయాబెటిస్ వంటివి లేకుండా చేస్తుంది
Weight Loss Powder : ఈ రోజుల్లో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. సమస్యలు రాకుండా ఉండాలన్నా వచ్చిన సమస్యలను తగ్గించుకోవటానికి ఇప్పుడు చెప్పే పొడి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఒక మిక్సీ జార్ లో రెండు స్పూన్ల వాము,రెండు స్పూన్ల జీలకర్ర, రెండు స్పూన్ల అవిసె గింజలను వేసి మెత్తని పొడిగా తయారుచేసుకోవాలి.
ఈ పొడి ఎక్కువ మొత్తంలో తయారుచేసుకొని నిల్వ చేసుకోవచ్చు. ఫ్రిజ్ లో పెడితే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఫ్రిజ్ లో పెట్టకుండా బయట ఉంచితే 15 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో అరస్పూన్ పొడి వేసుకొని కలిపి తాగాలి. లేదా చపాతీ,అట్లు వంటివి వేసుకున్నప్పుడు దానిలో కలపవచ్చు. లేదా మధ్యాహ్నం భోజనంలో తినవచ్చు.
ఈ పొడి తీసుకోవటం వలన శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది. అలాగే జీర్ణ సంబంద సమస్యలు గ్యాస్,కడుపు ఉబ్బరం,మలబద్దకం వంటి అన్నీ రకాల సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా డయాబెటిస్ ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గటమే కాకుండా డయాబెటిస్ కారణంగా వచ్చే సమస్యలు లేకుండా చేస్తుంది.
శరీరంలో విషాలను బయటకు పంపుతుంది. రోజుకి అరస్పూన్ మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఈ పొడిలో వాడిన ఇంగ్రిడియన్స్ వేడి చేసే గుణం కలిగి ఉంటాయి. ఏదైనా మితంగా తీసుకుంటేనే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.