ఇంటిలో సులభంగా దొరికే వస్తువులతో ఆస్తమాకు చెక్…జీవితంలో ఉండదు
Asthma home remedies in telugu : ఆస్తమా లేదా ఉబ్బసం చాలా మందిని భాదించే ఆరోగ్య సమస్య. ఇది ప్రాణాంతకం కాక పోయినా,తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈ సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు,చనిపోయిన బాగుండేది అని చాలా మందికి అన్పిస్తుంది. దీన్ని పూర్తిగా తగ్గించటానికి మందు లేకపోయినా,దీని తీవ్రతను తగ్గించటానికి మాత్రం మందులు ఉన్నాయి. ప్రతిసారి మందులు వాడకుండా ఇంటిలో మీకు అందుబాటులో ఉండే పదార్దాలతో ఆస్తమా పెరగకుండా జాగ్రత్త పడవచ్చు.
కొన్ని తులసి ఆకులు,తేనే కలిపి ఉదయాన్నే పరగడుపున తింటే మంచి పలితాన్ని పొందవచ్చు. రాత్రి పడుకోబోయే ముందు కొన్ని మిరియాలను బుగ్గలో ఉంచుకొని చప్పరించి దాని రసాన్ని మింగితే కొంత వరకు దీని బారి నుండి తప్పించుకోవచ్చు. అయితే ఇది ఆస్తమా వచ్చిన కొత్తలో పనిచేస్తుంది.
కొద్దిగా నిమ్మరసం,చిన్న అల్లం ముక్క కలిపి తీసుకున్న కొంత వరకు ఉపశమనం కలుగుతుంది. అలాగే చిన్న పచ్చి పసుపు కొమ్మును అరగదీసి దానిలో తేనే కలిపి తీసుకున్న ఉపశమనం కలుగుతుంది. కొన్ని మెంతులను నీటిలో ఉడకబెట్టి,ఆ నీటిని వడకట్టి,చల్లారనిచ్చి అందులో చిటికెడు పసుపు,కొద్దిగా తేనే కలుపుకొని ఉదయం,సాయంత్రం త్రాగాలి. ఈ విధంగా కొన్ని రోజులు చేసినట్లైతే క్రమంగా ఆస్తమా నుండి ఉపశమనం పొందవచ్చు.
ఒక కప్పు పాలలో ఏడు లేదా ఎనిమిది వెల్లుల్లి రెబ్బలను వేసి మరిగించి,ఆ తర్వాత ఆ నీటిని ఉదయం,సాయంత్రం మందులా త్రాగితే క్రమంగా దీని బారి నుండి తప్పించుకోవచ్చు. ముఖ్యంగా ఆస్తమా ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఈ చిట్కా పనిచేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.