తులసి+తేనె కలిపి తీసుకుంటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా?
Tulsi with honey Benefits In telugu : తులసి,తేనె రెండింటిలోను ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. ఒక స్పూన్ తులసి రసంలో అరస్పూన్ తేనె కలిపి తీసుకుంటే ఊహించని ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఒక స్పూన్ తేనెలో 4 తులసి ఆకులను రెండు గంటలు నానబెట్టి కూడా తీసుకోవచ్చు.
దీనిలో అనేక రకాల న్యూట్రీషియన్స్ మరియు విటమిన్స్ ఉండటం వలన శరీరానికి ఎక్కువ పోషకాలను అందించి వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. దగ్గు,జలుబు వంటి సమస్యలను తగ్గించటంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది నేచురల్ డికంజెస్టెంట్ గా పనిచేసి శ్వాస సంబంద సమస్యలను తగ్గించటంలో చాలా బాగా పనిచేస్తుంది.
యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉండుట వలన ఎలర్జీ సమస్యలు ఉంటే తగ్గిపోతాయి. విటమిన్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన సెల్ జనరేషన్ నుప్రోత్సహించి ఏజింగ్ ప్రొసెస్ ను ఆలస్యం చేస్తుంది. కిడ్నీలో రాళ్ళను కరిగిస్తుంది. దాంతో కిడ్నీలలో టాక్సిన్స్ ను ఎఫెక్టివ్ గా తొలగించడంతో సహాయపడి కిడ్నీలు ఆరోగ్యంగా పనిచేసేలా చేస్తుంది.
శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గించే గుణాలు సమృద్దిగా ఉండుట వలన చెడు కొలెస్ట్రాల్ తొలగించి రక్తప్రసరణ బాగా సాగేలా చేసి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి గుండెకు ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మన ఇంటిలో ఉండే వస్తువులను జాగ్రత్తగా ఉపయోగించుకుంటే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.