ఈ ఆకులను మరిగించి నీటిని తాగితే జీర్ణ వ్యవస్థను క్లియర్ చేస్తూ డయాబెటిస్ ని తగ్గిస్తుంది
Cinnamon mint tea benefits : ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయస్సులోనే డయాబెటిస్ వచ్చేస్తుంది ఒక్కసారి డయాబెటిస్ వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాలి. అలాగే డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకుంటే మంచి ఫలితం వస్తుంది. డయాబెటిస్ నియంత్రణలో జీర్ణవ్యవస్థ పనితీరు కూడా కీలకమైన పాత్రను పోషిస్తుంది.
డయాబెటిస్ నియంత్రణ మరియు జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుండటానికి ఒక టీ తయారీ గురించి తెలుసుకుందాం. పొయ్యి మీద గిన్నె పెట్టి దానిలో ఒక గ్లాస్ నీటిని పోసి గుప్పెడు శుభ్రంగా కడిగిన పుదీనా ఆకులను,ఒక అంగుళం దాల్చిన చెక్క ముక్కను వేసి 5 నిమిషాల పాటు మరిగించి వడకట్టి ఆ నీటిని పరగడుపున తాగాలి.
ఈ విధంగా ప్రతి రోజు తాగుతూ ఉంటే డయాబెటిస్ నియంత్రణలో ఉండటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఈ టీ తాగటం వలన శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగి అధిక బరువు సమస్య నుండి బయట పడేస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా అజీర్ణం, జలుబు మరియు నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది.
యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. సహజసిద్దమైన పదార్ధాలతో ఇలా తయారుచేసుకొని తాగితే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.