Healthhealth tips in telugu

పరగడుపున తీసుకుంటే…పొట్ట శుభ్రం అవ్వటమే కాకుండా పొట్టలో నొప్పి,గ్యాస్,కడుపు ఉబ్బరం ఉండవు

Home remedies for gas In Telugu : సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవటం, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం,ఒత్తిడి వంటి కారణాలతో పొట్టకు సంబందించిన సమస్యలు గ్యాస్,కడుపు ఉబ్బరం,పొట్టలో నొప్పి వంటి సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యల నుండి బయట పడటానికి ఒక మంచి చిట్కా తెలుసుకుందాం.
gas troble home remedies
నాలుగు కరక్కాయలను తీసుకొని కచ్చా పచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలి. ఆతర్వాత పొయ్యి వెలిగించి పాన్ పెట్టి కచ్చా పచ్చాగా దంచిన కరక్కాయ ముక్కలు, ఒక స్పూన్ వాము, ఒక స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేగించుకోవాలి. వీటిని మిక్సీ జార్ లో వేయాలి. ఆ తర్వాత ఒక స్పూన్ సొంపు, ఒక స్పూన్ నల్ల ఉప్పు వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి.

ఈ పొడిని సీసాలో నిల్వ చేసుకోవచ్చు. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అరస్పూన్ పొడి కలిపి ఉదయం పరగడుపున తాగితే పొట్ట శుభ్రం అవ్వటమే కాకుండా పొట్టలో నొప్పి,గ్యాస్,కడుపు ఉబ్బరం వంటి పొట్టకు సంబందించి అన్నీ రకాల సమస్యలు తొలగిపోతాయి. ఈ చిట్కా ఫాలో అయ్యే వారు రోజులో ఎక్కువగా మంచి నీటిని తాగుతూ ఉండాలి.

అలాగే కొబ్బరి నీరు,మజ్జిగ వంటి వాటిని కూడా తాగుతూ ఉండాలి. ఈ పొడిలో ఉపయోగించిన అన్నీ ఇంగ్రిడియన్స్ పొట్టకు సంబందించిన సమస్యలను తగ్గించటానికి సహాయపడతాయి. అన్నీ మనకు అందుబాటులో ఉండేవే. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కంగారు పడకుండా చిట్కాలను ఫాలో అవ్వవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.