2 స్పూన్స్ ఇలా తీసుకుంటే రక్తంలో హీమోగ్లోబిన్ శాతం పెరిగి జీవితంలో రక్తహీనత సమస్య ఉండదు
sabudana in telugu :రక్త హీనత సమస్య ఉన్నప్పుడు నీరసం అలసట, ఆయాసం, గుండె దడ, కాళ్ళు చేతులు చల్లగా మారటం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు కనిపించినప్పుడు అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తపడాలి. రక్తహీనతకు చెక్ పెట్టడానికి కొన్ని ఆహారాలు చాలా బాగా సహాయపడుతాయి.
వాటిలో సగ్గుబియ్యం ఒకటి. సగ్గుబియ్యంలో పొటాషియం,పాస్పరస్,కాల్షియం,కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, సోడియం, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. ,
సగ్గుబియ్యం రెగ్యులర్ గా తీసుకుంటే రక్త కణాల సంఖ్య పెరిగి ఐరన్ లోపం తొలగిపోయి రక్తహీనత సమస్య తగ్గిపోతుంది. సగ్గుబియ్యాన్ని పాలలో లేదా నీటిలో ఉడికించి బెల్లం లేదా పంచదార కలుపుకుని తీసుకోవచ్చు
అలా కాకుండా సగ్గు బియ్యాన్ని ఉడికించి దానిలో మజ్జిగ కాస్త ఉప్పు వేసి తాగవచ్చు. లేదా సగ్గు బియ్యం తో పునుగులు వేసుకుని తినవచ్చు. సగ్గుబియ్యం తీసుకుంటే తక్షణ శక్తి లభిస్తుంది.. ఈ వేసవిలో సగ్గుబియ్యాన్ని తీసుకుంటే నీరసం వంటివి తగ్గుతాయి. అలాగే శరీరంలో వేడి తొలగిపోతుంది.
డయాబెటిస్ ఉన్నవారికి కూడా చాలా మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. అంతేకాకుండా మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులు ఉన్నవారికి నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. వేసవిలో వచ్చే జీర్ణ సంబంద సమస్యలు లేకుండా చేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.