థైరాయిడ్ ఉన్నవారు నిమ్మ రసం తీసుకుంటే ఏమి అవుతుందో తెలుసా ?
Thyroid In telugu :ఇటీవల కాలంలో చాలా మంది థైరాయిడ్ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఈ సమస్య ఎక్కువగా ఆడవారిలో కనిపిస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో మగవారిలో కూడా కనిపిస్తుంది. థైరాయిడ్ సమస్య వచ్చిందంటే కచ్చితంగా జీవితకాలం మందులు వాడాల్సిందే. అలాగే కొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. .
అందువల్ల థైరాయిడ్ సమస్య ఉన్నవారు కొన్ని ఆహారాలు తీసుకుంటే మంచిది. థైరాయిడ్ ఉన్న వారిలో అలసట., నీరసం, ఒత్తిడి, మైకం వంటి సమస్యలు ఉంటాయి. థైరాయిడ్ సమస్య ఉన్నవారు ప్రతిరోజు తగిన మోతాదులో నిమ్మ రసాన్ని తీసుకుంటే ఒత్తిడి, మైకం, నీరసం, అలసట వంటివి తగ్గుతాయి.
థైరాయిడ్ సమస్య ఉన్నవారు బరువు బాగా పెరిగి పోతారు అలాంటప్పుడు ప్రతి రోజూ ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ తేనె కలిపి తాగుతూ ఉండాలి. ఇలా చేస్తే బరువు నియంత్రణలో ఉంటుంది. థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు చర్మం పొడిగా మారటం, జుట్టు రాలటం వంటి సమస్యలు కూడా ఉంటాయి. .
ఈ సమస్యలను కూడా నిమ్మరసం తగ్గిస్తుంది. అయితే తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. నిమ్మరసం ఎక్కువగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి థైరాయిడ్ సమస్య ఉన్నవారు ప్రారంభంలో గుర్తిస్తే చాలా మంచిది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.