పెరుగు+మెంతులు కలిపి తీసుకుంటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా?
Fenugreek seeds and curd Health benefits : మెంతులు,పెరుగు రెండింటిలోను ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వీటిని విడిగా కాకుండా కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలను పొందవచ్చు. పెరుగు విషయానికి వస్తే పెరుగులో ఉండే ఖనిజాలు, విటమిన్స్,ప్రోటీన్ లు శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.
ఒక కప్పు పెరుగులో ఒక స్పూన్ మెంతులను కలిపి అరగంట అయ్యాక తినవచ్చు. లేదా ఒక కప్పు పెరుగులో అరస్పూన్ మెంతి పొడి కలిపి తీసుకోవచ్చు. లేదా రాత్రి సమయంలో ఒక స్పూన్ మెంతులను నానబెట్టి మరుసటి రోజు ఉదయం మెత్తని పేస్ట్ గా చేసి పెరుగులో కలిపి తినవచ్చు. ఈ విధంగా ప్రతి రోజు ఉదయం పరగడుపున తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు ఈ విధంగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండటమే కాకుండా అలసట,నీరసం వంటివి లేకుండా హుషారుగా ఉంటారు. అలాగే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి రక్త సరఫరా బాగా సాగి గుండెకు సంబందించిన సమస్యలు ఏమి ఉండవు.
శరీరంలో వ్యర్ధాలు తొలగిపోతాయి. శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది. అధిక బరువు సమస్యతో బాధపడుతున్నవారు పెరుగు, మెంతులు కలిపి తీసుకుంటే చాలా మంచి ప్రయోజనం కనపడుతుంది. జీర్ణ సంబంద సమస్యలు గ్యాస్,కడుపు ఉబ్బరం వంటివి ఏమి ఉండవు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.