Healthhealth tips in telugu

హైబీపీని (అధిక రక్త పోటు) నిర్లక్ష్యం చేస్తున్నారా… అయితే ప్రమాదంలో పడినట్టే

High bp symptoms In Telugu :ఈ రోజుల్లో మారిన జీవన శైలి, ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది చిన్న వయసులోనే అధిక రక్త పోటు సమస్య తో బాధపడుతున్నారు. సరైన పోషకాహారం తీసుకోకపోవడం, వ్యాయామం చేయకపోవటం, ఉప్పు ఎక్కువ ఉన్న ఆహారాలను తీసుకోవడం, ఒత్తిడి, మానసిక ఆందోళన, మద్యపానం, ధూమపానం ఇలా అనేక రకాల కారణాలతో రక్తపోటు సమస్య వస్తోంది.

రక్తపోటు సమస్య వచ్చింది అంటే కచ్చితంగా టాబ్లెట్లు వాడాల్సిందే. అలా టాబ్లెట్లు వాడుతూ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అధిక రక్తపోటును నిర్లక్ష్యం చేస్తే కిడ్నీ ఫెయిల్యూర్, గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం, కంటిచూపు మందగించడం వంటి సమస్యలు వస్తాయి.

కాబట్టి అధిక రక్తపోటు ఉన్నవారు మందులను వాడుతూ పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి అలాగే ఉప్పు ఉన్న ఆహారాలు, నిల్వ ఉన్న పచ్చళ్ళు తినడం మానేయాలి ప్రతిరోజు యోగా చేస్తే ఒత్తిడి తగ్గుతుంది కాఫీ కూల్ డ్రింక్స్ వాటికి దూరంగా ఉండాలి తరచుగా బిపిని చెక్ చేస్తూ ఉండాలి.

రక్తపోటును నియంత్రణలో ఉంచే ఆహారాలను రెగ్యులర్ గా తీసుకోవాలి. అలాగే ప్రతి రోజు తప్పనిసరిగా అరగంట వాకింగ్ చేయాలి. వాకింగ్ అనేది రక్తపోటు నియంత్రలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. కాబట్టి మంచి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.