Healthhealth tips in telugu

ఓట్స్+పాలు కలిపి తీసుకుంటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా?

Oats And Milk Benefits In Telugu : ఓట్స్,పాలల్లో ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. ఒక కప్పు పాలల్లో మూడు స్పూన్ల ఓట్స్ వేసి మూడు నిమిషాల పాటు ఉడికించి అరస్పూన్ బెల్లం పొడి వేసి బాగా కలిపి ఒక నిమిషం అయ్యాక తీసుకోవాలి.
oats benefits
ఓట్స్ పాలను ప్రతి రోజు తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పాలల్లో రిబోఫ్లావిన్ (B2) మరియు విటమిన్ B12 వంటి B విటమిన్ లు సమృద్దిగా ఉంటాయి. ఆక్సీకరణ ఒత్తిడి,నష్టాన్ని తగ్గిస్తుంది. బీటా గ్లూకాన్ అనే ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన జీర్ణాశయంలో ఒక జెల్ లాంటి పదార్థాన్ని ఏర్పాటు చేసి కొలెస్ట్రాల్‌తో బంధిస్తుంది మరియు దాని శోషణను తగ్గిస్తుంది.రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.

ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కాల్షియం మరియు విటమిన్ డి సమృద్దిగా ఉండుట వలన ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉంటాయి. వయస్సు పెరిగే కొద్ది వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. విటమిన్ డి అనేది జీర్ణవ్యవస్థ నుండి కాల్షియం శోషణకు సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది.

శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. బరువు తగ్గటానికి సహాయపడుతుంది. కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేసి తిందరగా ఆకలి లేకుండా చేస్తుంది. ఈ రెండింటిలో కాల్షియం, పొటాషియం, విటమిన్ బి-కాంప్లెక్స్ మరియు మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి, ఇవి శరీరాన్ని శక్తివంతంగా ఉంచడంలో సహాయపడతాయి. అలాగే ఐరన్ సమృద్దిగా ఉండుట వలన రక్తహీనత సమస్య అనేది ఉండదు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.