కీళ్ళ నొప్పులు ఉన్నవారు ఖచ్చితంగా తీసుకోవలసిన ఆహారం
Food for joint pain : ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కీళ్ల నొప్పులు, కీళ్ల మధ్య అరుగుదల అనేవి వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ కనబడుతున్నాయి. ఒకప్పుడు పెద్ద వారిలో మాత్రమే కనబడేవి. ఇప్పుడు 30 ఏళ్ళు వచ్చే సరికే ఈ నొప్పులు వస్తున్నాయి. ఈ నొప్పులు రావడానికి మారిన జీవన శైలి ఒత్తిడి, కాల్షియం లోపం వంటివి కారణాలుగా చెప్పవచ్చు.
చలికాలంలో ఈ నొప్పులు ఎక్కువగా ఉంటాయి. నొప్పుల నుండి ఉపశమనం కలగాలంటే కొన్ని ఆహారాలను తీసుకోవాలి. కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు రోజుకు ఒక అరటిపండు తీసుకోవాలి. అరటి పండులో ఉండే పొటాషియం., మెగ్నీషియం ఎముకల సాంద్రతను పెంచి నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రతి రోజు ఒక అరటి పండు తినవచ్చు.
అలాగే ఒక ఆరెంజ్ తీసుకుంటే ఆరెంజ్ లో ఉండే కాల్షియం ఎముకల పటుత్వాన్ని పెంచి కీళ్లనొప్పులను తగ్గిస్తుంది. అంతే కాకుండా ప్రతి రోజూ ఒక గ్లాసు పాలను తీసుకోవాలి. అలాగే పెరుగన్నం తప్పనిసరిగా తినాలి. కొంతమంది పెరుగు అన్నం తినడానికి ఇష్టపడరు. పెరుగు పాలు రెండింటిలోనూ ప్రోటీన్., కాల్షియం సమృద్ధిగా ఉంటాయి.
అలాగే రోజుకు నాలుగు బాదం పప్పులు తినాలి. రాత్రి సమయంలో నీటిలో బాదం పప్పులను నానబెట్టి మరుసటి రోజు ఉదయం తొక్క తీసి తినాలి. బాదంలో ఉండే కాల్షియం, పాస్పరస్ వంటివి ఎముకల దృఢత్వాన్ని పెంచి కీళ్ళనొప్పులు ఏమీ లేకుండా చేస్తాయి. చూశారుగా ఈ ఆహారాలను ప్రతి రోజూ రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.