30 రోజులు 1 స్పూన్ తింటే కీళ్ల నొప్పులు, కీళ్ల మధ్య శబ్ధం తగ్గి కీళ్ల మధ్య జిగురు పెరుగుతుంది
Joint Pains Home Remedies In telugu : మారిన జీవనశైలి పరిస్థితులు కారణంగా మనలో చాలా మంది చాలా చిన్న వయస్సులోనే ఎముకలు బలహీనంగా, పెళుసుగా మారి కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. నొప్పుల నుండి ఉపశమనం కొరకు ఒక మంచి రెమిడీ తెలుసుకుందాం. ఈ రెమెడీ కోసం అవిసె గింజలను తీసుకోవాలి. ఈ గింజలలో మెగ్నీషియం,మాంగనీస్,రాగి,భాస్వరం,థయామిన్.సమృద్దిగా ఉండుట వలన ఎముకలను బలపరచి కీళ్లను రక్షిస్తుంది.
ఆ తర్వాత తెల్ల నువ్వులను తీసుకోవాలి. నువ్వులలో పాలు కంటే ఏడు రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి అన్నీ రకాల ఎముకలకు సంబందించిన సమస్యలను తగ్గిస్తుంది. ఇక ఆ తర్వాత గుమ్మడి గింజలను తీసుకోవాలి. గుమ్మడి గింజలలో శోథ నిరోధక లక్షణాలు ఉండుట వలన కీళ్ళు మరియు ఎముకలలో నొప్పిని తగ్గిస్తుంది.
మిక్సీ జార్ లో 60 గ్రాములు అవిసే గింజలు,40 గ్రాములు తెల్ల నువ్వులు, 40 గ్రాములు గుమ్మడి గింజలను వేసి మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత 10 గ్రాముల Gelatin, 50 గ్రాముల ఎండు ద్రాక్ష వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని ఒక బౌల్ లోకి తీసుకొని దానిలో 200 గ్రాముల తేనె వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమంను ఫ్రిజ్ లో పెడితే దాదాపుగా 15 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ప్రతి రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయటానికి ముందు ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా 30 రోజుల పాటు తీసుకుంటే ఎముక ద్రవ్యరాశి నష్టాన్ని నివారిస్తుంది. కీళ్ల వాపును తగ్గిస్తుంది. కీళ్ల దృఢత్వం పెరుగుతుంది. అలాగే కీళ్ల మధ్య శబ్ధం తగ్గి కీళ్ల మధ్య జిగురు పెరుగుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.