Healthhealth tips in telugu

Moringa Flowers:ఈ పూల టీ తాగితే ఊహించని ప్రయోజనాలు ఎన్నో…అసలు నమ్మలేరు

Moringa flowers tea benefits : మునగ కాయలు,మునగ ఆకులలో ఉన్న ప్రయోజనాలు మనకు తెలుసు. అయితే మునగ పువ్వులలో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈ విషయం మనలో చాలా మందికి తెలియదు. మునగ చెట్టు పువ్వులు తెల్లగా గుత్తు గుత్తులుగా పుస్తాయి. ఈ పూలతో టీ తయారుచేసుకొని తాగితే చాలా ప్రయోజనాలు కలుగుతాయి.
Moringa Tea
గుప్పెడు మునగ పువ్వులను తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి గ్లాసు నీటిని పోసి మునగ పూలను వేసి 5 నుంచి 7 నిమిషాల వరకు మరిగించాలి. ఈ టీని వడకట్టి తేనె కలిపి ఉదయం సమయంలో పరగడుపున తాగాలి. డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తాగాలి. అలాగే గ్యాస్ సమస్య ఉన్నవారు పరగడుపున తాగకూడదు. బ్రేక్ ఫాస్ట్ చేసిన అరగంట తర్వాత తాగాలి.
Weight Loss tips in telugu
ఈ టీని ప్రతి రోజు ఉదయం పరగడుపున తాగితే అధిక బరువు,శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించటానికి సహాయపడుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సీజన్ మారినప్పుడు వచ్చే దగ్గు,జలుబు వంటి వాటిని తగ్గించటంలో సహాయపడుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేయటమే కాకుండా రక్తప్రసరణ బాగా సాగేలా చేస్తుంది.

అలాగే చెడు కొలెస్ట్రాల్ తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా ప్రోత్సహిస్తుంది. మూత్రంలో మంట,ఇన్ ఫెక్షన్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. నీరసం, అలసట,నిస్సత్తువ లేకుండా హుషారుగా ఉండేలా చేస్తుంది. జీర్ణ సంబంద సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. ఏ సమస్యలు లేని వారు వారంలో రెండు సార్లు తాగితే మంచిది.

మన చుట్టూ పక్కల ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే వాటిలో మనకు తెలియని ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉంటాయి. ప్రకృతి ప్రసాదించిన ఈ మొక్కలను ఉపయోగించుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. మునగ పూలను ఎక్కువగా ఆయుర్వేదంలో వాడతారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.