మిగిలిన సబ్బు ముక్కలతో ఇలా చేస్తే సన్ టాన్,ఓపెన్ పోర్స్,మచ్చలు అన్నీ మాయం అవుతాయి
sun Tan remove Tips : మన ఇంటిలో మిగిలిన సబ్బు ముక్కలను పాడేయకుండా ఇలా చేస్తే సన్ టాన్,ఓపెన్ పోర్స్,మచ్చలు అన్నీ తొలగిపోవటమే కాకుండా చర్మం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది. ఈ సమస్యల కోసం మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ మీద ఆధారపడవలసిన అవసరం లేదు.
మన ఇంటిలో దొరికే సహజసిద్దమైన వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. కాస్త ఓపిక,సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. ఈ రెమిడీ కోసం మూడు కమలాకాయల తొక్కలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. కమలా తొక్క సన్ టాన్ తొలగించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.
కమలా తొక్క యాంటీ ఏజింగ్ లక్షణాలను తగ్గిస్తుంది. రోజంతా ఫ్రెష్ గా ఉండేలా చేస్తుంది. ఒక నిమ్మకాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. నిమ్మకాయలో ఉన్న పోషకాలు మరియు బ్లీచింగ్ లక్షణాలు ముఖం మీద మొటిమలు లేకుండా తెల్లగా మెరిసేలా చేస్తుంది. పొయ్యి వెలిగించి ఒక గిన్నె పెట్టి దానిలో ఒక గ్లాస్ నీరు, కమలా తొక్కలు,నిమ్మకాయ ముక్కలు వేసి 5 నుంచి 7 నిమిషాలు ఉడికించాలి.
ఉడికిన కమలా,నిమ్మ ముక్కలను మిక్సీ జార్ లో వేయాలి. ఆతర్వాత అరకప్పు పాలను పోసి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ను వడకట్టి రసం తీసుకోవాలి. ఈ రసంలో మిగిలిన సబ్బు ముక్కలను తురిమి వేయాలి. ఈ మిశ్రమాన్ని పొయ్యి మీద పెట్టి సబ్భు కరిగేవరకు ఉంచాలి. సబ్బు కరిగాక పొయ్యి ఆఫ్ చేయాలి.
ఈ మిశ్రమం చల్లారాక ఒక స్పూన్ బాదం నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి. ఫ్రిజ్ లో పెడితే వారం రోజుల వరకు వాడవచ్చు. ప్రతి రోజు స్నానం చేసే సమయంలో ఉపయోగిస్తే వారం రోజుల్లో సన్ టాన్,ఓపెన్ పోర్స్,మచ్చలు మాయం అవ్వటమే కాకుండా ముఖం తెల్లగా కాంతివంతంగా మారుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.