Healthhealth tips in telugu

Diabetes for banana flower:డయాబెటిస్ ఉన్నవారు అరటి పువ్వు తింటే ఏమి అవుతుందో తెలుసా?

Banana flower control diabetics : మనలో చాలా మందికి అరటి పువ్వు తింటారు అనే విషయం తెలియదు. దీనిలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు తింటే కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

డయాబెటిస్ ఉన్నవారు తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డయాబెటిస్ నియంత్రణలో ఆహారం కీలకమైన పాత్రను పోషిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు అరటి పువ్వు తింటే ఏమి అవుతుందో తెలుసుకుందాం. మనలో చాలా మందికి అరటిపువ్వుతో కూర చేసుకుంటారని తెలియదు.
Diabetes In Telugu
అరటిపువ్వులో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అరటిపువ్వులో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు,పీచుపదార్థం,కొవ్వులు, calcium, ఫాస్ఫరస్, ఐరన్, కాపర్, పొటాషియమ్, మెగ్నీషియమ్, విటమిన్‌–ఈ వంటివి సమృద్దిగా ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారికి అరటి పువ్వు సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు.
Banana Flower Benefits In Telugu
అరటిపువ్వులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌ ఉంటుంది. అంతేకాకుండా ఫైబర్,యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. అరటిపువ్వులో అధిక కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించగల అనేక సమ్మేళనాలు ఉన్నాయి. అరటి పువ్వులో ఉండే ‘క్వెర్సెటిన్’,’కాటెచిన్’ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించే సామర్థ్యం కలిగి ఉంటాయి.

ఈ యాంటీఆక్సిడెంట్లు పిండి పదార్థాలను గ్రహించే ఎంజైమ్‌ను నిరోధిస్తాయి. అరటి పువ్వులో మీ శరీరానికి అవసరమైన అన్ని అమైనో యాసిడ్స్‌ ఉంటాయి. ఇది డయాబెటిక్ రోగులకు ఔషదంలా పని చేస్తుందని నిపుణులు అంటున్నారు. అలాగే డయాబెటిస్ ఉన్నప్పుడూ కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా పెరుగుతాయి.

అలా పెరగకుండా అరటిపువ్వులోని సమ్మేళనాలు సహాయపడతాయి. అరటి పువ్వు పల్లెటూర్లలో ఉండేవారికి బాగా సుపరిచితం. ఇప్పుడు సూపర్ మార్కెట్ లలో, రైతు బజార్ లలో కూడా విరివిగానే లభ్యం అవుతున్నాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు కనీసం వారంలో రెండు సార్లు తినటానికి ప్రయత్నం చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ