ఈ గింజలను ఉడికించి తింటే రక్తపోటు,కొలెస్ట్రాల్,అధిక బరువు అనేవి అసలు ఉండవు
pigeon pea Benefits In Telugu : ఫాబేసి కుటుంబానికి చెందిన కందులు నవ ధాన్యాలలో ఒకటి. కందులను పచ్చిగా ఉన్నప్పుడు ఉడికించుకొని తింటారు. కందులు బాగా ఎండాకా పప్పు చేసి వంటల్లో వాడుతూ ఉంటారు. ఈ పప్పును వారంలో మూడు సార్లు తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
కందులను పప్పుగా చేస్తే దానిని కందిపప్పు అని పిలుస్తారు. దీనిలో ప్రోటీన్, డైటరీ ఫైబర్, థయామిన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, కాపర్ ,మాంగనీస్ మరియు తగినంత మొత్తంలో ఐరన్ మరియు సెలీనియం ఉంటాయి. పొటాషియం సమృద్దిగా ఉండుట వలన రక్తపోటు నియంత్రణలో ఉండి కొలెస్ట్రాల్ లేకుండా రక్త ప్రవాహం బాగా సాగి గుండెకు సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటుంది.
పోలేట్ సమృద్దిగా ఉండుట వలన ఫోలేట్ లోపం వల్ల పుట్టబోయే బిడ్డలో రక్తహీనత మరియు లోపాలను నివారించడంలో సహాయపడుతుంది. వీటిలో
కేలరీలు, కొలెస్ట్రాల్ మరియు సంతృప్త కొవ్వులు తక్కువగా ఉంటాయి. అందువల్ల బరువు తగ్గటానికి ఒక ఆరోగ్యకరమైన ఎంపిక అని చెప్పవచ్చు.
డైటరీ ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి ఆకలి త్వరగా వేయదు.
జీవక్రియ రేటును పెంచి పోషకాలు కొవ్వుగా మారకుండా శక్తిగా మారుస్తుంది. దాంతో బరువు తగ్గుతారు. వీటిల్లో విటమిన్ B2 (రిబోఫ్లావిన్) మరియు నియాసిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీవక్రియ రేటును పెంచుతుంది మరియు కొవ్వు నిల్వను నిరోధిస్తుంది మరియు శక్తి స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది.
డయాబెటిస్ ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. వీటిలో ఉండే ప్రోటీన్స్ కండరాల నిర్మాణానికి సహాయపడి శరీరాన్ని దృడంగా ఉంచుతాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ వేసవిలో శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. అలసట,నీరసం రాకుండా చేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.