తమలపాకు గురించి ఈ విషయం తెలిస్తే రోజు ఒక్క ఆకు అయినా తింటారు…ఇది నిజం
Betel Leaves Benefits In telugu : తమలపాకు అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే పూజలు,వ్రతాలు,పెళ్లిళ్లలో తమలపాకును తప్పనిసరిగా వాడతారు. ప్రతి రోజు ఒక చిన్న తమలపాకు తింటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఒకప్పుడు తమలపాకు కావాలంటే బజారుకి వెళ్ళాల్సిందే. కానీ ఇప్పుడు దాదాపుగా ప్రతి ఇంటిలోనూ తమలపాకు తీగ ఉంటుంది.
తమలపాకులో విటమిన్-సీ, థియామిన్, రైబోఫ్లోవిన్, కేరోటిన్ లాంటి విటమిన్లు, కాల్షియం, శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ వంటి నిరోధక సమ్మేళనాలు ఉన్నాయి. వీటిలో ఫ్లేవనాయిడ్లు, టానిన్లు, ఆల్కలాయిడ్లు, స్టెరాయిడ్లు, క్వినోన్లు ఉన్నాయి. కాన్సర్ నిరోధక కారకంగానూ తమలపాకు పనిచేస్తుంది.
తమలపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్ గుణాలు గొంతు నొప్పి, ఇన్ ఫెక్షన్, దగ్గు,జలుబు వంటి వాటిని తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. అలాగే నోటిలో ఉండే బ్యాక్టీరియాను నాశనం చేసి నోటి దుర్వాసన లేకుండా చేస్తుంది. అలాగే చిగుళ్ళ వాపు, చిగుళ్ళ నుండి రక్తస్రావం వంటి వాటిని తగ్గిస్తుంది.
తమలపాకులో విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. ఇందులో కాల్షియం కూడా అధికంగా లభిస్తుంది. అందువల్ల కీళ్లనొప్పులు,మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు ప్రతి రోజు తింటే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.
డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు ఉన్నవారికి కూడా చాలా అద్భుతంగా పనిచేసి మానసిక ప్రశాంతత కలిగేలా చేస్తుంది. ఆకలి లేనివారిలో ఆకలిని పుట్టిస్తుంది. తీసుకున్న ఆహారం బాగా జీర్ణం చేసి గ్యాస్,కడుపు ఉబ్బరం,మలబద్దకం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. జీర్ణ సంబంద సమస్యలు ఉన్నవారు భోజనం చేసిన తర్వాత చిన్న తమలపాకు తింటే సరిపోతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.