ఒత్తిడి,టెన్షన్,ఆందోళన తగ్గించి మెదడును మెరుపు వేగంతో పని చేసేలా చేసే డ్రింక్
Thyme leaves benefits in telugu : డ్రై గా తైమ్ ఆకులు (Thyme Leaves) Online stores లో లభ్యం అవుతాయి. ఈ ఆకులలో ఉన్న ప్రయోజనాలు అలాగే ఈ ఆకుల గురించి కూడా మనలో చాలా మందికి తెలియదు. వీటితో టీ తయారుచేసుకొని తాగితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఈ మధ్య కాలంలో చాలా ప్రాచుర్యం పొందింది.
తైమ్ ఆకులను నీటిలో వేసి 5 నిమిషాల పాటు మరిగించి ఆ నీటిని వడకట్టి తేనె కలిపి తాగాలి. ఈ టీ తాగటం వలన మానసిక ఒత్తిడి, స్ట్రెస్, టెన్షన్ సమస్యలు తగ్గుతాయి. మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. వయస్సు పెరిగే కొద్ది వచ్చే అల్జీమర్స్ వంటి సమస్యలు రావు. మెదడు కణాలు, నరాలు ఆరోగ్యంగా ఉంటాయి.
తైమ్ ఆకులలో జియాక్సంతిన్, లుటిన్, అపిజెనిన్, నారింగెనిన్, లుటియోలిన్ మరియు థైమోనిన్ వంటి ఫినాలిక్ యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. అంతేకాక పొటాషియం , కాల్షియం, ఐరన్, మాంగనీస్, సెలీనియం మరియు మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. విటమిన్లు, ముఖ్యంగా బి-కాంప్లెక్స్ విటమిన్లు మరియు విటమిన్-కె, విటమిన్-సి మరియు ఫోలిక్ యాసిడ్ కూడా సమృద్దిగా ఉంటుంది.
యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు ఉండుట వలన సిరలు మరియు ధమనులను సడలించి రక్తప్రవాహం బాగా సాగేలా చేసి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. పొటాషియం సమృద్దిగా ఉండుట వలన హృదయ స్పందన రేటు మరియు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
డయాబెటిస్ ఉన్నవారిలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. అలసట,నీరసం వంటివి లేకుండా చేస్తుంది. ఈ డ్రింక్ తాగటం వలన హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి. ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేసి నొప్పులను తగ్గిస్తుంది. శ్వాస సంబంద సమస్యలను ముఖ్యంగా . బ్రోన్కైటిస్ చికిత్సలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.