ఒక్క కప్పు తీసుకుంటే చాలు…రక్తహీనత,నిద్రలేమి,ఎముకల బలహీనత, అలసట మాయం అవుతాయి
Halim Seeds Kheer Benefits : ఈ రోజుల్లో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలు రాకుండా ఉండాలన్నా వచ్చిన సమస్యలు తగ్గాలన్నా మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. Halim Seeds పాయసం వారంలో రెండు సార్లు తీసుకుంటే మంచి ప్రయోజనం కనపడుతుంది.
ముందుగా మిక్సీ జార్ లో రెండు స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు, 10 బాదం పప్పులు, 10 జీడిపప్పులు వేసి మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ లో రెండు స్పూన్ల halim seeds వేసి నీటిని పోసి మూడు గంటలపాటు నానబెట్టాలి. halim seeds ఉబ్బి జెల్లీ మాదిరిగా తయారవుతాయి.
Halim Seeds Online Stores, డ్రై ఫ్రూట్ షాప్ లలో లభ్యం అవుతాయి. ఆ తర్వాత ఖర్జూరంను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి అరలీటర్ పాలను పోసి కాస్త వేడి అయ్యాక నానబెట్టి ఉంచుకున్న Halim seeds వేసి బాగా కలపాలి. ఆ తర్వాత తయారుచేసి పెట్టుకున్న పొడిని వేసి కలపాలి.
ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఖర్జూరం ముక్కలను వేసి 5 నిమిషాలు మరిగించి పొయ్యి ఆఫ్ చేయాలి. ఈ పాయసంను వారంలో రెండు సార్లు తీసుకుంటే నిద్రలేమి,అలసట,నీరసం,నిస్సత్తువ, కీళ్ల నొప్పులు వంటి అన్నీ రకాల సమస్యలు తగ్గుతాయి. అలాగే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.
ఈ మధ్య కాలంలో రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. Halim Seeds లో ఐరన్ సమృద్దిగా ఉండుట వలన రక్తంలో హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్య నుండి బయట పాడేస్తుంది. అలాగే ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేసి బరువు తగ్గటానికి కూడా సహాయాప్డతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.