దాల్చిన చెక్క వాడే ముందు ఈ నిజాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి…లేకపోతే…?!
Dalchina Chekka benefits : దాల్చిన చెక్కను భారతీయ వంటకాలలో సుగంధ ద్రవ్యంగా వాడతారు. దాల్చిన చెక్కను ఎక్కువగా వంటల్లో వాడటం వలన చాలా మందికి దాల్చిన చెక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలియదు. దాల్చిన చెక్కలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. దాల్చిన చెక్కతో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.
దాల్చిన చెక్కలో మన శరీరానకి సహాయ పడే 41 సమ్మేళనాలు ఉంటాయి. దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. శరీరంలో చెడు కొలస్ట్రాల్ ని తొలగించి మంచి కొలస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది.బరువు తగ్గాలని అనుకునేవారు దాల్చిన చెక్కను వాడితే కొవ్వు నిల్వ ప్రక్రియలో పాల్గొనే అణువులను తగ్గించడం ద్వారా కొవ్వును తగ్గిస్తుంది.
దాంతో బరువు తగ్గుతారు. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మకాయ రసాన్ని పిండి అందులో ఒక స్పూన్ తేనె, అర స్పూన్ స్పూన్ దాల్చిన చెక్క పొడిని కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం పూట పరగడుపున తీసుకోవాలి. ఇలా మూడు నెలల పాటు చేస్తే సులభంగా బరువు తగ్గుతారు. దాల్చిన చెక్క టీ త్రాగటం వలన కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.
మధుమేహం ఉన్నవారికి దాల్చిన చెక్క చాలా మేలును కలిగిస్తుంది. దాల్చిన చెక్కలో ఉండే సమ్మేళనాలు అలనిన్ అనే ఎంజైమ్ ను శరీరంలో బ్లాక్ చేస్తుంది. ఇది ఆహారం తిన్న తర్వాత గ్లూకోజ్ ను గ్రహించకుండా చేస్తుంది. అందుకే దాల్చిన చెక్క ద్రావణం మధుమేహం పేషంట్స్ కు చాలా మంచిది. రక్తంలో గ్లూకోజ్ పెరగకుండా తగ్గిస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.