ఇంగువను ఎక్కువగా వాడుతున్నారా…. అయితే ఈ 6 నిజాలను తెలుసుకోకపోతే నష్టపోతారు
ఇంగువకు భారతీయ వంటకాలలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇంగువ ముక్కలు మరియు పొడి రూపంలో లభ్యం అవుతుంది. ఇంగువ మొక్క నుంచి వస్తుంది. ఫెరూలా అని పిలవబడే ఓ రకమైన మొక్కకు చెందిన పాలను ఉపయోగించి ఇంగువను తయారు చేస్తారు. ఘాటైన వాసన కలిగిన ఇంగువ వంటలకు రుచిని ఇస్తుంది. ఇంగువను ఎక్కువగా శాఖాహార వంటలలో వాడతారు.
తాలింపునకు, పచ్చళ్లలో కూడా ఇది ఒక సాధారణ దినుసు. ఇంగువలో ఫైబర్, కార్బోహైడ్రేట్స్, క్యాల్షియం, ఫాస్పరస్, ఐరన్, నియాసిన్, కెరోటిన్ మరియు రిబోఫ్లోవిన్ లు సమృద్ధిగాఉంటాయి .అంతేకాక యాంటీఆక్సిడెంట్, మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబ్యాక్టీరియల్, యాంటీ వైరల్ మరియు కార్మనేటివ్ నేచర్ కలిగి ఉంటుంది. పురాతన కాలం నుండి ఇంగువను ట్రెడిషనల్ మెడిసిన్ గా ఉపయోగిస్తున్నారు.
ఇంగువలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది కడుపు ఉబ్బరాన్ని తగ్గించుట, బాధనివారిణి. యాంటీ మైక్రోబియాల్, విరేచనకారిగా, నరాల ఉత్తేజకమందు, కఫ౦ తగ్గించేది, ఉపశమన౦ కల్గించేదిగా కూడా బాగా పనిచేస్తుంది. పురాతన కాలం నుండి ఇంగువను అజీర్ణం నయం చేయటంలో ఎక్కువగా వాడుతున్నారు. ఇంగువలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కడుపు మంటను తగ్గించటం,కడుపు చికాకు,గ్యాస్ వంటి అజీర్తి లక్షణాలను తగ్గించటంలో సహాయపడుతుంది.
అరకప్పు నీటిలో చిటికెడు ఇంగువ వేసుకొని త్రాగితే అజీర్ణ సమస్యలు తగ్గుతాయి. స్త్రీలకు సంబంధించిన రుతు సంబంధ సమస్యలు, నొప్పి,తిమ్మిరి వంటి సమస్యలకు ఒక శక్తివంతమైన మందు. శ్వాస కోశ సమస్యలను తగ్గిస్తుంది. ఒక స్పూన్ అల్లం రసంలో ఒక స్పూన్ తేనే,చిటికెడు ఇంగువ వేసుకొని బాగా కలిపి త్రాగితే పొడి దగ్గు, కోరింత దగ్గు, శ్వాస నాళముల వాపు, ఉబ్బసం వంటి శ్వాస సంబంధ వ్యాధుల నుండి మంచి ఉపశమనం కలుగుతుంది. ఇంగువ మధుమేహం ఉన్నవారికి సహాయపడుతుంది.
రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. ఇంగువలో ఉన్న లక్షణాలు క్లోమ కణాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి తద్వారా మరింత ఇన్సులిన్ స్రావాన్ని ఉత్పత్తి చేయడానికి సహయం చేస్తాయి. అధిక రక్తపోటు సమస్య ఉన్నవారికి ఇంగువ బాగా సహాయపడుతుంది. ఇంగువలో ఉండే కొమరిన్ లు రక్తాన్ని పలుచన చేసి, రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తాయి.అంతేకాక అధిక ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ కు వ్యతిరేకంగా పనిచేయటమే కాకుండా రక్తపోటును తగ్గించటంలో సహాయపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.