ఇలా చేస్తే ఎంతటి భరించలేని తలనొప్పి,మైగ్రేన్ అయినా సరే 5 నిమిషాల్లో తగ్గిపోతుంది
Headache Home Remedies : తలనొప్పి వచ్చిందంటే ఒక పట్టానా తగ్గదు. మనలో చాలామంది తలనొప్పి రాగానే షాప్ కి వెళ్ళి టాబ్లెట్లు తెచ్చుకొని వేసుకుంటూ ఉంటారు. అలా వేసుకోవడం వల్ల కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నార్మల్ తలనొప్పి అయినా మైగ్రేన్ తలనొప్పి అయినా ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది.
పుదీనా టీ తాగితే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని,గుప్పెడు పుదీనా ఆకులను వేసి పొయ్యి మీద పెట్టి మరిగించాలి. 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి. ఈ నీటిని వడకట్టి రుచి కోసం ఒక స్పూన్ తేనె కలిపి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఈ టీ తాగితే తలనొప్పి నుండి చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది.
తులసి కూడా తలనొప్పిని తగ్గించటానికి సహాయపడుతుంది. తులసిలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు తలనొప్పిని తగ్గించటంలో సహాయపడతాయి. నాలుగు తులసి ఆకులను శుభ్రంగా కడిగి నమిలి మింగవచ్చు. తులసి ఆకుల నుండి రసాన్ని తీసి దానిలో తేనె కలిపి కూడా తీసుకోవచ్చు.
వాము కూడా నొప్పులను తగ్గించటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. వాములో థైమోల్ అనే రసాయనం ఉంటుంది. ఇది అనాల్జేసిక్‌గా పనిచేసి తలనొప్పి నుండి ఉపశమనం కలిగేలా చేస్తుంది. తలనొప్పిగా ఉన్నప్పుడూ కొంచెం వాము నోట్లో వేసుకొని నములుతూ ఆ రసాన్ని నిదానంగా మింగాలి. లేదంటే వాము కషాయం చేసుకొని తాగవచ్చు.
తలనొప్పి తక్కువగా ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పిన చిట్కాలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. అదే తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మందులు వాడుతూ ఈ చిట్కాలను ఫాలో అయితే చాలా మంచి ఉపశమనం కలుగుతుంది. ఇప్పుడు చెప్పిన మూడు చిట్కాలు చాలా బాగా పనిచేస్తాయి. మీ లభ్యతను బట్టి చిట్కాలను ఫాలో అవ్వండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.