Healthhealth tips in telugu

ఈ టీ తాగితే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరగటమే కాకుండా రోగనిరోధకశక్తి పెరుగుతుంది

weight Loss and boost your immunity Drink : అధిక బరువు మరియు శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే డ్రింక్ గురించి తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో అధిక బరువు సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగితే చాలా మంచి ఫలితం ఉంటుంది.
Weight Loss tips in telugu
Parsley ఆకులు అధిక బరువుని తగ్గించటమే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. Parsley ఆకులలో A, E, C వంటి విటమిన్లు,మెగ్నీషియం, పొటాషియం, ఇనుము మరియు కాల్షియం వంటి ఖనిజాలు సమృద్దిగా ఉన్నాయి.

శరీరం నుండి అదనపు నీటిని తొలగిస్తుంది. శరీరంపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది. రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. పిరియాడ్స్ సమయంలో వచ్చే నొప్పిని తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. అలాగే రుమాటిజం మరియు ఆర్థరైటిస్‌ వంటి సమస్యలను తగ్గిస్తుంది.

రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా ప్రోత్సహిస్తుంది. కిడ్నీలో రాళ్ళ సమస్యతో బాధపడేవారు ఈ డ్రింక్ తాగితే చిన్నగా ఉన్న రాళ్ళు కరిగిపోతాయి. ఐరన్ సమృద్దిగా ఉండుట వలన రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది.
Immunity foods
పొయ్యి మీద గిన్నె పెట్టి రెండు గ్లాసుల నీటిని పోసి గుప్పెడు Parsley ఆకులను వేసి 5 నుంచి 7 నిమిషాల వరకు మరిగించాలి. ఈ నీటిని వడకట్టి ఒక స్పూన్ నిమ్మర్శం, ఒక స్పూన్ తేనె కలిపి ప్రతి రోజు ఉదయం తాగితే అధిక బారు తగ్గటమే కాకుండా శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.