అర గ్లాస్ ఊపిరితిత్తులలో కఫం,శ్లేష్మంను క్లీన్ చేసి లంగ్ కెపాసిటీని పెంచుతుంది
Lungs Cleaning drink:ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు. మనలో చాలా మంది చిన్న వయసులోనే ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాగే కొంతమందికి కఫం, శ్లేష్మం వచ్చి ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఊపిరితిత్తుల్లో కణజాలం కూడా దెబ్బతింటుంది.
లంగ్ కెపాసిటీని పెంచుకోవడం కోసం ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. పొయ్యి వేలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి అరస్పూన్ అల్లం తురుము, అరస్పూన్ వాము, పది పుదీనా ఆకులు,పావు స్పూన్ అతిమధురం పొడి, ఆరు మిరియం గింజలను కచ్చా పచ్చాగా దంచి వేసి 5 నిమిషాల పాటు మరిగించాలి.
ఈ కాషాయన్ని మరిగించి ఉదయం పరగడుపున తాగాలి. ఈ విధంగా మూడు లేదా నాలుగు రోజుల పాటు తాగితే కఫం,శ్లేష్మం తొలగిపోయి ఊపిరితిత్తులు శుభ్రం అయ్యి లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఈ డ్రింక్ తాగటం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి శ్వాస సంబంద సమస్యలు తొలగిపోవాలంటే తప్పనిసరిగా ఈ డ్రింక్ తాగాలి.
అల్లంలో ఉన్న జింజీరాల్స్ ఊపిరితిత్తులలో గాలి గొట్టాల వెడల్పు పెంచి ఆక్సిజన్ రేటు పెరిగేలా చేస్తాయి. వాములో ఉన్న లక్షణాలు కూడా ఊపిరితిత్తులు శుభ్రంగా ఉండటానికి సహాయపడతాయి. అలాగే పుదీనాలో ఉన్న లక్షణాలు వాపులను తగ్గిస్తుంది. అతిమధురంలో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు ఇన్ ఫెక్షన్ తగ్గించటానికి సహాయపడతాయి.
మిరియాలలో ఉండే పెప్పరిన్ కూడా చాలా బాగా సహాయపడుతుంది. సమస్య చిన్నగా ఉన్నప్పుడూ ఈ ఇంటి చిట్కాలను ఫాలో అవ్వవచ్చు. అదే సమస్య తీవ్రంగా ఉన్నప్పుడూ డాక్టర్ సలహాను పాటిస్తూ ఇప్పుడు చెప్పిన కషాయం తాగితే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. కాబట్టి ఈ చిట్కాను ఫాలో అవ్వండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.