మజ్జిగ బదులు దీన్ని తాగితే శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు 100 శాతం అందుతాయి
Immunity boosting drink : మన శరీరానికి అవసరమైన పోషకాలు అందాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారాలను తీసుకోవాలి. ఇప్పుడు చెప్పే లస్సీ తాగితే మన శరీరానికి అవసరమైన పోషకాలు అంది ఆరోగ్యంగా ఉంటాం. లస్సీ తయారీ ఎలానో చూద్దాం. ముందుగా ఒక బౌల్ లో ఒక కప్పు జీడిపప్పు,ఒక కప్పు బాదం పప్పు వేసి నీటిని పోసి 5 గంటలు నానబెట్టాలి.
ఆ తర్వాత ఒక కప్పు ఖర్జూరం తీసుకొని దాని లోపల గింజలు తీసేయాలి. నానపెట్టిన బాదం పై తొక్క తీసి పక్కన పెట్టాలి.మిక్సీ జార్ లో తొక్క తీసిన బాదం పప్పు, నానిన జీడిపప్పు వేసి ఆ తర్వాత ఒక కప్పు కిస్ మిస్, ఒక కప్పు గింజలు తీసిన ఖర్జూరం వేసి మిక్సీ చేయాలి. ఈ పేస్టులో ఒక కప్పు పెరుగు వేసి మరల లస్సీ మాదిరిగా మిక్సీ చేయాలి.
ఇలా తయారైన మిశ్రమాన్ని గ్లాసులోకి తీసుకోవాలి. లస్సీలో ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియంట్స్ చాలా సహజసిద్ధమైనవి. అలాగే మనం దీనిలో బెల్లం లేదా పంచదార రెండింటిని వాడలేదు. వారంలో మూడు సార్లు తీసుకుంటూ ఉంటే శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరిగి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావు.
అలాగే మెదడు చురుగ్గా పనిచేసి వయసు పెరిగే కొద్దీ వచ్చే అల్జీమర్స్ వంటి జ్ఞాపకశక్తి సమస్యలు లేకుండా చేస్తుంది. అంతే. కాకుండా calcium సమృద్ధిగా ఉండటం వలన ఎముకలు, దంతాలు బలంగా ఉంటాయి. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. శారీరక మానసిక అలసట లేకుండా హుషారుగా ఉంటారు. రక్తహీనత సమస్య నుంచి కూడా బయటపడతారు.
ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ లస్సీని వారంలో రెండు సార్లు తాగితే సరిపోతుంది. ఏదైనా మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవటం అలవాటు చేసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది. కాబట్టి ఇటువంటి ఆహారాలను తీసుకోవటానికి ప్రయత్నం చేయండి. అప్పుడు ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.