మజ్జిగలో ఈ ఆకు కలిపి తీసుకుంటే ఊహించని ఎన్నో ప్రయోజనాలు…అసలు వదిలిపెట్టరు…ఇది నిజం
Buttermilk and curry leaves drink : మజ్జిగ,కరివేపాకులలో ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే వీటిని విడిగా కాకుండా కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. ఒక మిక్సీ జార్ లో గుప్పెడు కరివేపాకు ఆకులను శుభ్రంగా కడిగి వేయాలి. ఆ తర్వాత ఒక కప్పు పెరుగు, మూడు నల్ల మిరియాలు వేయాలి.
ఆ తర్వాత పావు స్పూన్ జీలకర్ర,అర అంగుళం అల్లం ముక్క, రుచికి సరిపడా ఉప్పు,ఒక కప్పు నీటిని పోసి మిక్సీ చేయాలి. మిక్సీ చేశాక ఒక గ్లాస్ లో పోసి తాగాలి. ఈ మజ్జిగ తాగటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతి రోజు తాగవచ్చు. అలా కుదరని వారు కనీసం వారంలో మూడు సార్లు తాగిన మంచి ఫలితం ఉంటుంది.
అధిక బరువు సమస్యతో బాధపడేవారు ప్రతి రోజు కరివేపాకుతో తయారుచేసిన మజ్జిగ తాగితే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరుగుతుంది. ఆకలి నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా డయాబెటిస్ ఉన్నవారు ఈ మజ్జిగను తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అలాగే చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది.
జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. పొట్టకు సంబందించిన సమస్యలు గ్యాస్,కడుపు ఉబ్బరం వంటి వాటిని తగ్గిస్తుంది. మజ్జిగలో కాల్షియం, విటమిన్ లు సమృద్దిగా ఉంటాయి. రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. కరివేపాకులో ఫైబర్, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ మరియు C, A, B & E వంటి విటమిన్ లు సమృద్దిగా ఉంటాయి.
యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసి ఆరోగ్యం బాగుండేలా ప్రోత్సహిస్తుంది. కరివేపాకు శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడానికి సహాయపడుతుంది.యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండుట వలన చర్మానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది. మంచి కంటి చూపు కోసం చాలా అద్భుతంగా పనిచేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.