యాలకులతో ఇలా చేస్తే చాలు ఆస్తమాకు చెక్ పెట్టవచ్చు…జీవితంలో ఉండదు
Health Benefits of Elaichi : ఆస్తమా ఒక్కసారి వచ్చిందంటే తగ్గటం చాలా కష్టం. చలికాలంలో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ కాలంలో ఊపిరి సరిగా ఆడక చాలా ఇబ్బంది పడిపోతు ఉంటారు. ఆస్తమా రావటానికి అనేక కారణాలు ఉన్నప్పటికి దగ్గు, ఆయాసం, ఛాతీ నొప్పి, పిల్లికూతలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కామన్ గా ఉండే లక్షణాలు.
ఈ వ్యాధి పూర్తిగా తగ్గదు. ఉపశమనం కోసం మాత్రమే మందులు ఉంటాయి. ఆస్తమా నియంత్రణలో ఉంచటానికి మన వంటింటిలో ఉండే యాలకులు అద్భుతంగా పనిచేస్తాయి. మసాలాలలో రారాణి అయిన యాలకుల్లో ఎన్నో ప్రయోజనలు ఉన్నాయి. ధర కాస్త ఎక్కువగా ఉన్నా దానికి తగ్గట్టుగానే ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
యాలకులను పొడిగా చేసుకొని నిల్వ చేసుకోవాలి. ఒక గ్లాస్ గోరువెచ్చని పాలల్లో పావు స్పూన్ యాలకుల పొడి,బెల్లం వేసుకొని తాగాలి. డయబెటిస్ ఉన్నవారు బెల్లం వేసుకోకూడదు. ఛాతీ నొప్పి, పిల్లికూతలు, శ్వాస తీసుకోలేకపోవడం, దగ్గు, ఆయాసం వంటి ఆస్తమా లక్షణాలకు దూరంగా ఉండొచ్చు.
వేడి వేడి అన్నంలో యాలకుల పొడి వేసుకొని రెండు ముద్దలు తిన్నా మంచి ఫలితం ఉంటుంది. ఆస్తమా ఉన్నవారు తప్పనిసరిగా ప్రతి రోజు డైట్ లో యాలకులను చేర్చుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఊపిరితిత్తులలో ఏర్పడే శ్లేష్మం టాక్సిన్స్ బయటకు పంపి శ్వాసకోశ మార్గాలు క్లియర్ గా ఉండేలా చేస్తుంది.
ఆస్తమా ఉన్నవారు ఈ చలికాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వంటింటిలో ఉండే యాలకులు చాలా సమర్ధవంతంగా ఆస్తమా నుండి ఉపశమనం కలిగిస్తుంది. యాలకులలో ఉండే సినియోల్ అనే క్రియాశీల పదార్ధం ఒక శక్తివంతమైన యాంటీమైక్రోబయల్ మరియు యాంటిసెప్టిక్, ఇది ఊపిరితిత్తులను ప్రభావితం చేసే బ్యాక్టీరియా ఇన్ ఫెక్షన్ ని నిరోధించడంలో సహాయపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.