వర్షాకాలం అయ్యేంత వరకు ప్రతి రోజు అర గ్లాసు తాగితే ఏ సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు
Kerala Red Water Benefits : ఈ ఆయుర్వేద Red Water కేరళలో చాలా ప్రసిద్ది చెందింది. అక్కడ వారు కాఫీ,టీలకు బదులుగా Red Water తాగుతూ ఉంటారు. sappan wood నుంచి ఈ Red Water ని తయారుచేస్తారు. sappan wood ని PATHIMUGAM అని కూడా పిలుస్తారు. sappan wood ధర విషయానికి వస్తే కేజీ 400 నుంచి 450 రూపాయిల వరకు ఉంటుంది.
Red Water ని ఎలా తయారుచేయాలో చూద్దాం. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక లీటర్ నీటిని పోసి ఒక స్పూన్ sappan wood ముక్కలను వేసి 5 నుంచి 7 నిమిషాలు మరిగించి ఆ నీటిని వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. అరగ్లాస్ మోతాదులో తాగాలి. ఈ సీజన్ లో REd water తాగితే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. శరీరంలో విషాలను బయటకు పంపుతుంది.
యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన ఫ్రీ రాడికల్స్ యొక్క హానికరమైన ప్రభావాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. రక్తాన్ని శుద్ది చేస్తుంది. Red Water డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తాయి. సీజనల్ గా వచ్చే దగ్గు,జలుబు,గొంతు నొప్పి, గొంతు ఇన్ ఫెక్షన్ వంటి వాటిని తగ్గిస్తుంది.
చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారికి కూడా హెల్ప్ చేస్తుంది. మొటిమలు మరియు చర్మ సమస్యలు ఉన్నప్పుడూ sappan wood పొడిలో నీటిని కలిపి సమస్య ఉన్న ప్రదేశంలో రాసి 5 నిమిషాలు అయ్యాక శుభ్రం చేసుకుంటే తగ్గుతాయి.
Red Water లో ఉండే సపోనిన్ A అనే సమ్మేళనం మన మెదడుపై రక్షణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. వాపు మరియు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడి అల్జీమర్స్ మరియు పార్కిన్సన్స్ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీనిలో బ్రెజిలిన్ మరియు సప్పోనోన్తో సహా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండుట వలన నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.