వారంలో 2 సార్లు ఈ సూప్ తాగితే డయాబెటిస్, అధిక బరువు, చెడు కొలెస్ట్రాల్ అనేవి ఉండవు
Diabetes Bottle gourd soup : ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి పరిస్థితుల కారణంగా చాలా చిన్న వయసులోనే డయాబెటిస్ వచ్చేస్తుంది. డయాబెటిస్ కారణంగా మనిషి సగటు ఆయుర్దాయం తగ్గిపోతుంది. డయాబెటిస్ వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాల్సిందే. అలా మందులు వాడుతూ డయాబెటిస్ ని నియంతంలో ఉంచే ఆహారాలను తీసుకోవాలి. .
డయాబెటిస్ అనేది నియంత్రణలో లేకపోతే కిడ్నీ, గుండె, ఊపిరితిత్తులు, కంటి సమస్యలు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకుంటూ ప్రతిరోజు అరగంట వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. అప్పుడే డయాబెటిస్ నియంత్రణలో ఉండి డయాబెటిస్ కారణంగా వచ్చే సమస్యలు రావు.
డయాబెటిస్ ఉన్న వారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచడానికి సొరకాయ సూప్ చాలా బాగా సహాయపడుతుంది. ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత లేదా రాత్రి భోజనం తర్వాత సొరకాయతో తయారు చేసిన సూప్ తీసుకుంటే మంచిది. అయితే ఈ సూప్ ని వారంలో రెండు రోజులు తీసుకుంటే డయాబెటిస్ అనేది నియంతంలో ఉంటుంది.సొరకాయలో నీరు మరియు ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన డయాబెటిస్ నిర్వహణకు సహాయపడుతుంది.
డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు అత్యంత ఆరోగ్యకరమైన కూరగాయలలో సొరకాయ ఒకటి. సొరకాయలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉంటాయి. అలాగే కేలరీలు తక్కువ…పోషకాలు ఎక్కువగా ఉంటాయి. డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచటమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ పెరకుండా నియంత్రణలో ఉండేలా చేస్తుంది. అధిక బరువు సమస్యను తగ్గించటానికి కూడా సహాయపడుతుంది.
ఇది సులభంగా జీర్ణం అవుతుంది. ఇది గ్లూకోజ్ మరియు చక్కెర సంబంధిత సమ్మేళనాలను చాలా తక్కువగా కలిగి ఉంది. ఇన్సులిన్ స్థాయిలను పెంచి రక్తంలో గ్లూకోజ్‌ని గణనీయంగా తగ్గిస్తుంది.దీనిలో ఉండే బయోయాక్టివ్ మెటాబోలైట్స్ యాంటీ డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. సొరకాయ సూప్ తీసుకొని ఈ సమస్యల నుంచి బయట పడండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.