తేనెను ఇలా వాడుతున్నారా… అయితే ఈ నమ్మలేని నిజాలు తెలుసుకోండి
Honey Side Effects :తియ్యగా ఉండే తేనెను చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. తేనెలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో ఎక్కువగా తేనెను వాడతారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగటానికి మనలో చాలామంది ప్రతిరోజూ తేనెను ఉపయోగిస్తున్నారు.
తేనె లో విటమిన్ సి ఉండటం వలన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండేలా చేస్తుంది. అలాగే అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు కూడా తేనె ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ దీని విషయంలో ప్రతి ఒక్కరు ఒక పొరపాటు చేస్తూ ఉంటారు. అది పొరపాటు అని కూడా తెలియదు.
వేడి వేడి పదార్థాల్లో తేనె కలిపి తీసుకుంటూ ఉంటారు. కొందరు వేడి టీలో తేనె వేసుకుంటూ ఉంటారు. అలా వేడి పదార్థాలలో తేనె కలిపి తీసుకోకూడదు. గోరువెచ్చగా ఉన్నప్పుడు తేనే కలిపి తీసుకోవచ్చు. బాగా వేడి ఉన్నప్పుడు తేనె కలిపితే తేనె లో ఉండే మైనం విషం గా మారే అవకాశం ఉంది . .
కాబట్టి వేడి పదార్థాలలో తేనే కలపకుండా గోరువెచ్చగా ఉన్న పదార్ధాల్లో తేనె కలిపి తేనె లో ఉన్న ప్రయోజనాలు అన్నిటినీ పొందవచ్చు. గోరువెచ్చని నీటిలో తేనె కలిపి ఉదయం సమయంలో తీసుకుంటే చలికాలంలో వచ్చే దగ్గు జలుబు గొంతునొప్పి తగ్గటమే కాకుండా రోజంతా హుషారుగా ఉంటారు.
తేనెలో ఉన్న పోషకాలు అన్ని మన శరీరానికి అందాలంటే తప్పనిసరిగా తేనెను జాగ్రత్తగా వాడాలి. తేనె కంపెనీ తేనె కాకుండా ఆర్గానిక్ తేనె దొరికితే ఆ తేనెను వాడటానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ మధ్య కాలంలో కల్తీ తేనె ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/