ఈ గింజల గురించి ఎవరికి తెలియని అద్భుతమైన రహస్యం…అసలు నమ్మలేరు
Bobbarlu Health benefits In telugu :నవధాన్యాలలో ఒకటైన బొబ్బర్లను అలసందలు అని కూడా పిలుస్తారు ఇవి మంచి రుచి కలిగి ఉంటాయి. వీటిని ఉడికించుకొని తాలింపు పెట్టుకునే తినవచ్చు…లేదా వీటిని ఉడికించి పిండిలో కలిపి రొట్టెలు వేసుకుని తినవచ్చు. వీటిలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
బొబ్బర్లను మనలో చాలా మంది తింటారు. కానీ వాటిలో ఉన్న ప్రయోజనాలు గురించి పెద్దగా తెలియదు. ఈ బొబ్బర్ల లో తక్కువ క్యాలరీలు తక్కువ కొవ్వు ఉంటుంది. అలాగే డైటరీ ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది. వీటిని తినడం వల్ల కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు.
అలాగే డయాబెటిస్ ఉన్నవారికి కూడా చాలా మంచిది.దీనిలో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వల్ల శరీరంలో హానికర టాక్సిన్స్ బయటికి పంపేసి ఎటువంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది.
వీటిలో ఉండే పొటాషియం, మెగ్నీషియం అనేవి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ ప్రక్రియ బాగా సాగేలా చేస్తుంది. అంతేకాకుండా మలబద్ధకం, గ్యాస్ కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. ఈ బబ్బర్లు సంవత్సరం పొడవునా మనకు అందుబాటులో ఉంటాయి.
ధర కూడా అందరికీ అందుబాటులోనే ఉంటుంది కాబట్టి మంచి పోషకాలు ఉన్న బొబ్బర్ల ను తిని మంచి ఆరోగ్యాన్ని పొందండి. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే మన శరీరానికి అవసరమైన పోషకాలు అంది ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి పోషకాలు ఉన్న ఆహారాన్ని తినటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/