పిల్లల మెదడు చురుగ్గా ఉండేలా చేసి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత సమస్యలు లేకుండా చేస్తుంది
Brain Foods for Children : పిల్లల బ్రెయిన్ షార్ప్ గా పని చేయాలంటే పోషకాహారం అనేది కీలకమైన పాత్రను పోషిస్తుంది. మంచి ఆహారం పిల్లల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, మెదడు పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది.పిల్లల మెదడు పనితీరును మెరుగుపరిచే ఆహారాల గురించి తెలుసుకుందాం. వీటిని పిల్లలకు రెగ్యులర్ గా పెడితే మంచిది.
ప్రతి రోజు గుడ్డు ఆహారంలో బాగంగా ఉండేలా చూసుకోవాలి. Egg లో ప్రోటీన్స్,పోషకాలు సమృద్దిగా ఉండుట వలన మెదడు పనితీరు మెరుగుపడి రిటెన్షన్ శక్తిని, క్యమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. “సెరోటోనిన్” అనే హ్యాపీనెస్ హార్మోన్‌ను నిర్మించడంలో కూడా Egg సహాయపడుతుంది. దాంతో పిల్లలు చురుకుగా ఉత్సాహంగా ఉంటారు.
స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీ, బ్లాక్ బెర్రీ, రాస్బెర్రీ లాంటి బెర్రీ జాతికి చెందిన పండ్లలో యాంథోసైనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన మెదడులో రక్తప్రసరణ మెరుగుపడటం మరియు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి మెదడు పనితీరును మెరుగుపరచి జ్ఞాపకశక్తి సామర్థ్యంను పెంచుతుంది. ప్రతి రోజు బెర్రీలు తింటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
పాలకూర, బచ్చలికూర, కాలే వంటి ఆకు కూరల్లో పిల్లల మెదడును రక్షించే ఫ్లేవనాయిడ్లు, విటమిన్ ఈ, కె 1 వంటి పోషకాలు సమృద్దిగా ఉంటాయి. ఆకుకూరల్లో ఉండే గ్లూకోసినోలేట్స్ అనే సమ్మేళనం శరీరంలోని ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తుంది. ఆకుకూరలు పిల్లల మెదడు ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడతాయి.
మెదడు పనితీరు బాగుండాలంటే జీడిపప్పు, బాదం, పిస్తా, వాల్‌నట్స్ వంటి నట్స్ రెగ్యులర్ గా తీసుకోవాలి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ E అనేవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. సెరోటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ ఉత్పత్తికి సహాయపడటం వలన ఒత్తిడి లేకుండా ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా వాల్ నట్స్ లో విటమిన్ బి6, మెగ్నీషియం సమృద్దిగా ఉండుట వలన జ్ఞాపకశక్తిని పెంచడంలోనూ సహాయపడతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.