Healthhealth tips in telugu

జీలకర్ర+బెల్లం కలిపి తీసుకుంటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా?

Cumin seeds and jaggery water benefits : జీలకర్ర, బెల్లం రెండింటిలోను ఎన్నో పోషకాలు,ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి ఒక స్పూన్ జీలకర్ర వేసి 5 నుంచి 7 నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత ఒక స్పూన్ ఆర్గానిక్ బెల్లం వేసి ఒక నిమిషం మరిగించి వడకట్టి తాగాలి.
jeelakarra Health Benefits in telugu
జీలకర్ర మరియు బెల్లంలో పొటాషియం సమృద్దిగా ఉండుట వలన కడుపులో ఉత్పత్తి అయ్యే ఆమ్లాలను తటస్తం చేయడంలో సహాయపడి గ్యాస్, అజీర్ణం,అసిడిటీ వంటి సమస్యలను తగ్గిస్తుంది. జీర్ణశక్తి పెరిగేలా చేస్తుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారు భోజనం చేసిన తర్వాత తీసుకుంటే మంచి ప్రయోజనం కనపడుతుంది. బరువును తగ్గించటంలో కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
Jaggery Health Benefits in Telugu
మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. అనేక రకాల కారణాలతో రక్తంలో అనేక రకాల మలినాలు మరియు టాక్సిన్స్ పేరుకుపోయి అనేక రకాల వ్యాధులకు కారణం కావచ్చు. బెల్లం మరియు జీలకర్రలోని ఖనిజాలు రక్తప్రవాహంలో ఉన్న టాక్సిన్స్‌ను బయటకు పంపి, సహజంగా రక్తాన్ని శుద్ధి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
Immunity foods
జీలకర్ర మరియు బెల్లంలో మెగ్నీషియం మరియు పొటాషియం సమృద్దిగా ఉండుట వలన శరీరంలోని ప్రతి కణాన్ని బలోపేతం చేస్తుంది. అలాగే వ్యాధిని కలిగించే కారకాల మీద పోరాటం చేసి, శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. రక్తహీనత సమస్య ఉన్నవారిలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్యను తగ్గిస్తాయి.

రక్తపోటును నియంత్రణలో ఉంచి రక్తప్రసరణ బాగా సాగేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. జీలకర్ర మరియు బెల్లం రెండింటిలో ఉండే పొటాషియం మరియు ఇతర ఖనిజాలు వాపు మరియు నొప్పిని తగ్గించడానికి కీళ్లకు రక్త ప్రవాహాన్ని పెంచుతాయి. దాంతో నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. ఉదయం సమయంలో తాగితే రోజంతా హుషారుగా ఉంటారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.