ఈ జ్యూస్ తాగితే జలుబు, దగ్గు, ఫ్లూ, వైరల్ ఫీవర్స్ వంటి సీజనల్ వ్యాధులు రావు
Monsoon Health Drink : వర్షాకాలం ప్రారంభం అయింది. వానలు విపరీతంగా కురుస్తున్నాయి. సీజన్ మారినప్పుడు వాతావరణంలో వచ్చే మార్పులు మన శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ సీజన్లో వచ్చే సమస్యలను తగ్గించుకోవడానికి ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకరకంగా చెప్పాలంటే ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి.
ఈ సీజన్ లో వెజిటేబుల్ జ్యూస్ తాగితే కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. వెజిటేబుల్ జ్యూస్ ఎలా తయారుచేయాలో చూద్దాం. ఒక బీట్రూట్ ,ఒక కీరదోస, ఒక క్యారెట్ తీసుకుని పై తొక్క తీసేసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక టమాటా తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఒక మిక్సీ జార్ లో కట్ చేసి పెట్టిన ఈ ముక్కలు అన్నింటినీ వేయాలి. ఆ తర్వాత అరచెక్క నిమ్మరసం, ఒక గ్లాసు నీటిని వేసి మిక్సీ చేస్తే వెజిటేబుల్ జ్యూస్ రెడీ అయినట్టే. వారంలో రెండుసార్లు తీసుకుంటే శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అయి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా మన శరీరాన్ని కాపాడుతుంది.
అంతే కాకుండా సీజన్ మారినప్పుడు సాదరణంగా వచ్చే జలుబు, దగ్గు, ఫ్లూ, వైరల్ ఫీవర్స్ వంటి వాటిని రాకుండా కాపాడుతుంది. అలాగే ఈ సీజన్ లో వచ్చే జీర్ణ సమస్యలు రాకుండా చేస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉండేలా చేయటంలో ఈ జ్యూస్ చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.
ఈ మధ్య కాలంలో మనలో చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య నుండి బయట పడటానికి ఈ జ్యూస్ మంచి ఎంపిక అని చెప్పవచ్చు. రక్తహీనత సమస్య ఉన్నవారు రోజు విడిచి రోజు తాగితే మంచి ఫలితం కనపడుతుంది. ఒక విషయాన్ని తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాలి. గ్యాస్ సమస్య ఉన్నవారు ఈ జ్యూస్ ని పరగడుపున తాగకూడదు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.