ఉల్లిపాయను చక్రాల్లా కోసి కాళ్ళ కింద పెట్టుకొని సాక్స్ వేసుకొని పడుకుంటే ఏమి అవుతుందో తెలుసా ?
onion slice in socks : మనం ప్రతిరోజూ వంటల్లో ఉల్లిపాయలను వాడుతూ ఉంటాం. ఉల్లిపాయ కోసినప్పుడు ఉల్లిలో ఉండే ఘాటు కారణంగా కళ్ళ వెంట నీళ్లు వస్తాయి. కన్నీటిని తెప్పించే ఉల్లిపాయ వలన మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి. ఉల్లిపాయను చక్రాల్లా కోసి కాళ్ళ కింద పెట్టుకొని సాక్స్ వేసుకొని పడుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు చెప్పుతున్నారు.
రాత్రి పడుకొనే సమయంలో కాళ్ళ కింద ఉల్లి చక్రాలను పెట్టుకొని సాక్స్ వేసుకొని పడుకొని తెల్లవారిన తర్వాత తీసేయాలి. ఈ విధంగా చేయటం వలన పాదాలు మృదువుగా మారటమే కాకూండా పాదాల పగుళ్లు కూడా తగ్గుతాయి. మన పూర్వీకులు ఈ పద్దతిని అనుసరించేవారు. ఉల్లిపాయను పాదాల కింద ఉంచడం ద్వారా శరీరంలో వ్యాధులు అంతర్గతంగా నయం అవుతాయని నమ్ముతారు.
అలాగే సహజంగా శరీరాన్ని శుభ్రపరుస్తుంది, వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది , రోగనిరోధక శక్తిని పెంచుతుందని నమ్ముతారు. ఉల్లిపాయల నుండి ఫాస్ఫారిక్ యాసిడ్ చాలా ఎక్కువగా వస్తుంది. అయితే ఇది ఎప్పుడైతే శరీరానికి దగ్గర ఉంటుందో అప్పుడు రిలీజ్ అవ్వడం జరుగుతుంది.
ఇలా ఉల్లిని సాక్స్‌లో పెట్టుకోవడం వల్ల కూడా అవుతుంది.
వేడి కారణంగా ఇది విడుదల అవుతుంది. ఇది రక్త నాళాల్లోకి వెళ్ళి ప్యూరిఫికేషన్ అవ్వడానికి సహాయపడుతుంది. బ్లడ్ సర్కులేషన్ బాగా అవుతుంది. హీలింగ్ చేస్తుంది మరియు క్లెన్సింగ్ చేస్తుంది. మన పాదాలలో నరాల ఎండింగ్ ఉంటుంది. అయితే సాక్సులలో ఉల్లిపాయల్ని పెట్టుకొని నిద్ర పోవడం వల్ల బ్లడ్ ప్యూరిఫై అవుతుంది.
అలానే టాక్సిన్స్‌ని కూడా బయటకు పంపించేస్తుంది. ఇలా కూడా ఉల్లి మనకు సహాయం చేస్తుంది. అయితే మన పూర్వీకులు కూడా ఈ పద్ధతిని అనుసరించేవారు. అయితే ఉల్లిపాయలను సాక్స్‌లో ఉంచడం వల్ల కలిగే ప్రయోజనాలకు మద్దతు ఇవ్వడానికి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఇది ఒక నమ్మకం మాత్రమే.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.