దగ్గు,జలుబు, గొంతు నొప్పి, గొంతు ఇన్ ఫెక్షన్ ని త్వరగా తగ్గించే ఎఫెక్టివ్ హోంరెమిడీస్ ఇవే.
Cold Home Remedies In Telugu : సీజన్ మారింది. ప్రస్తుతం మనలో చాలా మంది దగ్గు, జలుబు, గొంతు నొప్పి, గొంతు ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్నారు. ఇవి ప్రారంభ దశలో ఉన్నప్పుడూ ఇప్పుడు చెప్పే చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. కాస్త ఓపికగా చేసుకుంటే మంచి ఫలితం ఇస్తాయి. అన్ని మన వంటింటిలో ఉండేవే.
పసుపు పాలు
దగ్గు సమస్య పోగొట్టుకునేందుకు రోజుకి రెండుపూటలా గ్లాసు పాలల్లో ½ టీ స్పూన్ పసుపు వేసుకుని తాగాలని సూచిస్తున్నారు. వదలని దగ్గుకి మరో ఇంటి చిట్కా ఏంటంటే ఇదే మిశ్రమానికి వెల్లుల్లి కలపటం. ఏముంది, వెల్లుల్లిలో ఒక పాయని తీసుకుని పాలతో కలిపి మరిగించి, తర్వాత ఒక చిటికెడు పసుపు వేయండి.
ఇలాంటి పాలు ఎందుకు అవసరం అంటే అది మీ గొంతుని బాగు చేస్తుంది. వెల్లుల్లి బదులు అల్లం కూడా వేసుకోవచ్చు. రెండూ ఒకే విధంగా పనిచేస్తాయి. ఆగకుండా దగ్గుతుంటే ఉపశమనం కోసం రోజులో కొన్నిసార్లు పసుపునీళ్ళతో పుక్కిలించండి. పసుపులో కర్కుమిన్ అనే పదార్థం ఉంటుంది.
ఇది వైరస్,బ్యాక్టీరియా, వాపు వంటి లక్షణాలని తగ్గించటంలో సాయపడతాయి. అల్లం, వెల్లుల్లి టాన్సిల్స్ ప్రాంతంలో దిబ్బడను తగ్గించి సహజ నొప్పి నివారుణుల్లా పనిచేస్తాయి. మీరు నిద్రపోయే ముందు దీనిని తాగితే ఏ రకమైన చిరాకు కలగదు. ఇంకా, వేడి పాలైతే ఛాతీ నుండి మ్యూకస్ ను పైకి లాక్కొస్తాయి కూడా. దీంతో మీరు రిలీఫ్ అవుతారు.
నల్ల మిరియాలు
దగ్గు వేధిస్తుంటే, మిరియాల కషాయం మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. వేడి చేసే గుణం కఫాన్ని తొలగించటంలో సాయపడుతుంది. ఈ కషాయాన్ని కనీసం రోజుకి రెండు మూడు సార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పొయ్యి మీద గిన్నె పెట్టి 1 గ్లాస్ నీటిని పోసి కొంచెం వేడి అయ్యాక నాలుగు మిరియాలను దంచి వేయాలి. మరిగాక వడకట్టి తాగాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.