Beauty Tips

ఈ ఆయిల్ ఇలా వాడితే చుండ్రు,జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు 2 రెట్లు వేగంగా పెరుగుతుంది

Hair Fall Tips Amla : ఈ మధ్యకాలంలో మారిన జీవనశైలి పరిస్థితులు, వాతావరణ కాలుష్యం, జుట్టు పట్ల శ్రద్ధ పెట్టకపోవడం వంటి అనేక రకాల కారణాలతో జుట్టుకు సంబంధించి ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. జుట్టు రాలటం, జుట్టు డామేజ్ అవ్వటం, చివర్లు చిట్లటం, జుట్టు పొడిగా మారటం, చుండ్రు వంటి అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి.
cococnut Oil benefits in telugu
ఈ సమస్యలు వచ్చినప్పుడు ఖరీదైన షాంపూ, నూనెలు వాడాల్సిన అవసరం లేదు. మన ఇంటిలో సహజ సిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి నూనెను తయారు చేసుకుని వాడితే జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి.. పొయ్యి వెలిగించి పొయ్యి మీద గిన్నె పెట్టి దానిలో అర లీటర్ కొబ్బరి నూనె పోయాలి.
Diabetes tips in telugu
కొబ్బరి నూనె కాస్త వేడయ్యాక ఒక స్పూన్ ఆవపిండి, నాలుగు లవంగాలు, రెండు స్పూన్ల ఉసిరికాయ తురుము, రెండు స్పూన్ల ఉల్లిపాయ తురుము, ఒక స్పూన్ మెంతుల పొడి వేసి గరిటతో తిప్పుతూ ఐదు నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత నాలుగు మందార ఆకులను చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసి వేయాలి.
Mustard seeds Benefits In telugu
ఆ తర్వాత గుప్పెడు గోరింటాకు ఆకులు, రెండు రెబ్బల కరివేపాకు, రెండు మందార పువ్వుల రేకలను చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత పది తులసి ఆకులను వేసి 10 నుంచి 12 నిమిషాల పాటు సిమ్ లో పెట్టి బాగా మరిగించాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నూనె కాస్త చల్లారాక పల్చని వస్త్రం సాయంతో వడకట్టాలి. .
hair fall tips in telugu
ఈ నూనెను సీసాలో పోసి నిల్వ చేసుకుంటే దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ నూనెను రాత్రి సమయంలో జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా పట్టించి cap పెట్టుకుని మరుసటి రోజు ఉదయం కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే జుట్టుకి సంబందించిన సమస్యలు అన్నీ తొలగిపోతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.