Healthhealth tips in telugu

1 గ్లాసు వారంలో 2 సార్లు తాగితే ఊహించని ఎన్నో ప్రయోజనాలు…ముఖ్యంగా రక్తహీనత ఉన్నవారికి…

Dried apricot juice Health Benefits: ఈ మధ్య కాలంలో మనలో చాలా మంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టి డ్రై ఫ్రూట్స్ తినడం ప్రారంభించారు. డ్రై ఫ్రూట్స్ లో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో డ్రై ఆప్రికాట్స్‌ ఒకటి. ఇవి ఒకప్పుడు చాలా అరుదుగా లభించేవి. కానీ ప్రస్తుతం ఆన్లైన్ స్టోర్ లో మరియు డ్రై ఫ్రూట్ షాపులలో విరివిగానే లభిస్తున్నాయి.
dry apricot
డ్రై ఆప్రికాట్స్‌ లో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో calcium, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐర‌న్‌, విటమిన్ ఎ, విటమిన్ సి, విట‌మిన్ బి వంటివి సమృద్దిగా ఉన్నాయి. ఈ డ్రై ఫ్రూట్ తో డ్రింక్ తయారుచేసుకొని తాగితే ఎన్నో ఊహించని ప్రయోజనాలను పొందవచ్చు.
apricot Benefits in telugu
ఒక బౌల్ లో 5 డ్రై ఆప్రికాట్స్‌ వేసి వేడి నీటిని పోసి 5 గంటలు నానబెట్టాలి. 5 గంటలు అయ్యాక నీటితో సహ మిక్సీ జార్ లో వేసి మిక్సీ చేయాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ పాలు, ఒక స్పూన్ బ్రౌన్ షుగర్, ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ బాదం ముక్కలు, ఒక స్పూన్ పిస్తా ముక్కలు, ఒక స్పూన్ జీడిపప్పు ముక్కలు వేసి మిక్సీ చేయాలి.
Top 10 iron rich foods iron deficiency In Telugu
అంతే డ్రై ఆప్రికాట్‌ జ్యూస్ తయారు అయినట్టే. ఈ జ్యూస్ ని వారంలో రెండు సార్లు తాగితే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో రక్తహీనత సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. అలాంటి వారికి ఈ జ్యూస్ ఒక వరం వంటిది అని చెప్పవచ్చు. అలాగే కాల్షియం సమృద్దిగా ఉండుట వలన కండరాల నిర్మాణానికి మరియు ఎముకలు ఆరోగ్యంగా బలంగా ఉండటానికి సహాయపడుతుంది.
saraswati Plant
మెగ్నీషియం మరియు ఫాస్పరస్ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. పొటాషియం సమృద్దిగా ఉండుట వలన రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. విటమిన్ A సమృద్దిగా ఉండుట వలన కంటి శుక్లం మరియు గ్లకోమా వంటి కంటి సమస్యలను తగ్గిస్తుంది. ఇది జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది మరియు ఆకలిని కలిగించే ఆమ్లాలను తటస్థీకరిస్తుంది. జీర్ణాశయంలో విష పదార్ధాలను బయటకు పంపుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.