ఇంటిలో మందార మొక్క ఉందా…అయితే ఊహించని ప్రయోజనాలు ఎన్నో…అసలు నమ్మలేరు
Hibiscus tree benefits In telugu : మాల్వేసి కుటుంబానికి చెందిన మందార ఒక అందమైన పూల మొక్క. మందార మొక్కను చైనీస్ హైబిస్కస్ లేదా చైనా రోస్ అని కూడా పిలుస్తారు. దీనిని ఉష్ణ మరియు సమసీతోష్ణ ప్రాంతాలలో అలంకరణ కోసం ఎక్కువగా పెంచుతారు. పువ్వులు పెద్దవిగా సామాన్యంగా ఎరుపు రంగులో సువాసన లేకుండా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.
మందార పువ్వులు తెలుపు, పసుపు, కాషాయం వంటి అనేక రకాల రంగులలో పూస్తాయి. మందార మొక్కలో ఆకులు,పువ్వులు,కాండం ఇలా దాదాపుగా అన్ని భాగాలు ఉపయోగపడతాయి. అలాగే ఎన్నో ఆరోగ్య,బ్యూటీ ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఈ రోజు మందార మొక్క గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. భారతీయ ప్రాచీన ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా ఉపయోగించేవారు.
కొన్ని దేశాలలో ఎండిన మందార ఆకులను వంటకాలకు గార్నిష్ గా ఉపయోగిస్తారు. మందార పువ్వులతో టీ తయారుచేస్తారు. కొన్ని పరిశోధన ద్వారా మందార ఆకులలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని కనుగొన్నారు. ఆయుర్వేదం ప్రకారం ఎరుపు మరియు తెలుపు మందారాలలో ఎక్కువ ఔషధ గుణాలు ఉన్నాయని నమ్ముతారు. మందార ఆకులలో ఉన్న ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
మందార ఆకులను మెత్తని పేస్ట్ గా చేసి తలకు పట్టిస్తే మంచి కండిషనర్ గా పనిచేస్తుంది. అలాగే జుట్టు ముదురు రంగులో మారటానికి మరియు చుండ్రు తగ్గించడానికి సహాయపడుతుంది. కొన్ని దేశాలలో మందార ఆకులతో టీ తయారుచేసి ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు. కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు మూత్ర విసర్జన ఇబ్బంది ఏర్పడుతుంది. ఆ సమయంలో ఈ టీ త్రాగితే మూత్ర విసర్జనకు ప్రేరకంగా పనిచేస్తుంది.
అంతేకాకుండా డిప్రెషన్ సమయములో మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. మందార ఆకు చర్మ సంరక్షణలో కూడా చాలా ఎక్కువగానే ఉపయోగి స్తున్నారు. చర్మం మీద ముడతలు తగ్గిస్తుంది. అలాగే అతినీలలోహిత రేడియేషన్ పీల్చుకునే యాంటీ సౌర ఏజెంట్ గా బాగా సమర్ధవంతంగా పనిచేస్తుంది. మందార ఆకు టీని త్రాగటం వలన రక్తపోటు అదుపులో ఉంటుంది.
ఇటీవల మందార ఆకుపై చేసిన పరిశోధనల్లో ఈ విషయం తెలిసింది. కాబట్టి రక్తపోటు సమస్యతో బాధపడుతున్నవారు మందార ఆకు టీని త్రాగితే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. మందార ఆకు టీ LDL కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. దాని కంటెంట్ ధమనుల లోపలి భాగంలో పొరలు ఏర్పడకుండా నివారించడంలో సహాయపడుతుంది. తద్వారా మీ కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.