Healthhealth tips in telugu

ఆకుపచ్చని కూరగాయల జ్యూస్ తాగుతున్నారా…ఈ నిజాలు మీకు తెలుసా…?

Green Juice Benefits In telugu : ఆకుపచ్చని కూరగాయలు మరియు ఆకుకూరలు తినడం వల్ల కలిగే లాభాలు మనందరికీ తెలిసినవే. అయితే వాటిని కేవలం పదార్దాలుగా మాత్రమే కాకుండా రసాలుగా తీసుకున్నా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కూరగాయలు మరియు ఆకుకూరలు ఏవైనా సరే రసంలా తీసుకుంటే దానిలో క్లోరోఫిల్ శాతం ఎక్కువగా ఉంటుంది.
blood thinning
ఇది శరీరానికి అవసరమైన ప్రాణ వాయువును అందిస్తుంది. శరీరంలో పేరుకున్న వ్యర్దాలను బయటకు పంపిస్తుంది. ఎర్ర రక్తకణాలు వృద్దికి తోడ్పతుంది. ఆకుపచ్చని రసంలో పీచు,పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇవి అధిక రక్త పోటును అదుపులో ఉంచటంలో సహాయపడుతుంది. ఈ రెండు పోషకాలు ఆకుపచ్చని రసాలలో ఎక్కువగా ఉంటాయి.

చర్మ౦ మెరవాల౦టే ఆకుపచ్చని రసాలను మి౦చిన ప్రత్యామ్నాయం లేదు. వీటిలో ఉ౦డే నీటి శాతం చర్మానికి అవపరయైన తేమను అందిస్తుంది. వీటిలోవి యాంటిఆక్సిడెంట్, ఫ్లవనయిడ్స్ రోగనిరోధకశక్తివి పె౦చుతాయి. ఫ్రీ రాడికల్స్ ని నివారిస్తాయి. ఈ పోషకాలు కాలేయం, మూత్రపిండాలు, ఉదరంను శుభ్రం చేస్తాయి.
Weight Loss tips in telugu
ప్రతి రోజు రెండు గ్లాసులు ఏదైనా ఆకుకూరల రసం త్రాగే వారు చాలా సులువుగా బరువు తగ్గుతారు. దానిలో కొద్దిగా నిమ్మరసం కలిపి త్రాగితే మంచి పలితాలు వస్తాయి. కూరగాయల రసంలో కేలరీలు తక్కువుగా ఉంటాయి. అందువల్ల బరువు తగ్గటం కూడా సులువుగా ఉంటుంది. వీటిని పచ్చిగా తీసుకోవటం కొద్దిగా కష్టంగా ఉంటుంది.
Ginger benefits in telugu
అయితే వీటిలో రుచి కోసం అల్లం,పుదీనా,నిమ్మరసం వంటి వాటిని కలుపుకోవచ్చు. అయితే గ్యాస్ సమస్య ఉన్నవారు పచ్చి జ్యూస్ తాగితే గ్యాస్ సమస్య పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.