ప్రతి రోజు అల్లం తింటున్నారా…ముఖ్యంగా ఈ సమస్యలు ఉన్నవారు తింటే…ఏమి అవుతుందో…?
Ginger Tips In Telugu : అల్లంలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీర్ణ సంబంద సమస్యలను తగ్గించటానికి మరియు సీజనల్ గా వచ్చే వ్యాధులను తగ్గించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. అయితే కొన్ని సమస్యలు ఉన్నవారు అల్లం తినకుండా ఉంటేనే మంచిదని నిపుణులు అంటున్నారు. వాటి గురించి తెలుసుకుందాం.
జీర్ణ రసాలను నియంత్రించి జీర్ణ ప్రక్రియ బాగా సాగేలా చేయటమే కాకుండా ఆకలిని నియంత్రించి బరువు తగ్గటానికి సహాయపడుతుంది. అయితే పొట్టిగా బరువు తక్కువగా ఉన్నవారిలో బాడీ మాస్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. వారి శరీరంలో విటమిన్ల లోపం కనపడుతుంది. అలాంటి వారు అల్లం తినకూడదు.
Haemophilia సమస్య ఉన్నవారు అల్లం తినకూడదు. ఎందుకంటే శరీరం నుండి అధిక రక్తస్రావం జరిగితే, రక్తం గడ్డకట్టడం అవసరం. అల్లం సాధారణంగా శరీరంలో రక్త ప్రసరణను ఉత్తేజపరిచేందుకు ఉపయోగిస్తారు. అయితే Haemophilia సమస్య ఉన్నవారు అల్లం తినడం వల్ల శరీరంలో అధిక రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది.
గర్భధారణ సమయంలో ముఖ్యంగా చివరి త్రైమాసికంలో, అల్లం ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. ఇది premature delivery మరియు తీవ్రమైన కడుపు నొప్పికి దారితీస్తుంది. డయాబెటిస్,రక్తపోటు కోసం మందులు వాడేవారు తక్కువ మోతాదులో మాత్రమే అల్లంను తీసుకోవాలి. అల్లంను ఎక్కువగా తీసుకుంటే రక్తపోటులో హెచ్చుతగ్గులు వచ్చే అవకాశం ఉంది.
అల్లం తినకూడని వారు దానికి బదులుగా ఏమి తీసుకోవాలనే సందేహం మనలో చాలా మందికి ఉంటుంది. శరీరంలో జీర్ణక్రియ బాగా జరగాలంటే అల్లంకు బదులుగా మిరియాలను తీసుకోవచ్చు. సమస్యలు ఉన్నప్పుడూ ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకొని తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.